Chennoor | మార్కెట్ కమిటీ ఛైర్మెన్ గా…

Chennoor | మార్కెట్ కమిటీ ఛైర్మెన్ గా…
- మహేష్ ప్రసాద్ తివారి
Chennoor | చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు మార్కెట్ కమిటీ ఛైర్మెన్ గా కోటపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ ప్రసాద్ తివారీని నియమించినట్లు కమిషనర్ అఫ్ డైరెక్టర్ మార్కెటింగ్ నుంచి స్థానిక కార్యాలయానికి నియామక ఉత్తర్వులు వచ్చాయి. కోటపెల్లి మండలం నాగంపేట గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబానికి చెందిన మహేష్ ప్రసాద్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గత కొన్నేళ్లుగా కోటపెల్లి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతూ, ఎమ్మెల్యే, ఎంపీల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేశారు.
