Development | డ్రైనేజి సమస్య పరిష్కార పై కృషి

Development | డ్రైనేజి సమస్య పరిష్కార పై కృషి

  • గ్రామ అభివృధిపై ప్రత్యేక కృషి చేస్తున్న గ్రామ ఉప సర్పంచ్ రాచకొండ విష్ణువర్ధన్ శంకర్ గౌడ్,
  • డ్రైనేజి సమస్య పరిష్కార దిశగా అడుగులు..

Development | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలం బడా భీమ్‌గల్ గ్రామంలో డ్రైనేజి సమస్య(Drainage problem)కు పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న గ్రామ సర్పంచ్ రాచకొండ విష్ణువర్థిని, శంకర్ గౌడ్. 10వ‌ వార్డ్ లో ఉన్నటువంటి డ్రైనేజి సమస్య కొరకు నూతన కల్వర్ట్ ని ఈ రోజు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.

పదవులు అంటే కేవలం అధికారం మాత్రమే కాదు, ప్రజాసేవకు అప్పగించిన బాధ్యత అని గ్రామ నూతన సర్పంచ్ రాచకొండ విష్ణువర్థిని, శంకర్ గౌడ్ నిరూపిస్తున్నారు. ప్రమాణ స్వీకారం(Oath-taking) చేసిన కొద్దీ రోజులకే గ్రామ అభివృద్ధి(Development)పై ప్రత్యేక దృష్టి సారించిన సర్పంచ్ విష్ణువర్థిని, శంకర్ గౌడ్ రోజు ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు ప్రతి వార్డును సందర్శించారు. ఉదయం వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సమస్య ఏదైనా పరిష్కారం కోసం ప్రజల వద్దకే వెళ్తున్న సర్పంచ్ చొరవ అభినందనీయం అని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, మాజీ సర్పంచ్ సంజీవ్, గ్రామ కమిటీ సభ్యులు, ఈర్ల సాయిబాబ, గ్రామ యువకులు శ్రీకాంత్, గోపి, జంగం చిన్ని, అరుణ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply