Inderavelly | అడ్రస్ లేని వార్డెన్‌…

Inderavelly | అడ్రస్ లేని వార్డెన్‌…

  • అప్ అండ్ డౌన్‌తో దళితులకు అన్యాయం..

Inderavelly | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్నిమెనూ ప్ర‌కారం అందించాల‌నుకుంటే మండలానికి చెందిన దళిత ఆశ్రమ పాఠశాల అప్ అండ్ డౌన్ చేసే వార్డెన్‌లే దర్శనమిస్తున్నారు. ఈ రోజు మండలానికి చెందిన ప్రముఖ ఆశ్రమ పాఠశాల గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన వార్డెన్ లు క్రమశిక్షణతో పాటు ఆశ్రమ పాఠశాలలో మొక్కలను నాటి ఆ మొక్కలను కాపాడుతూ నందనవనంగా తయారు చేశారు. అయినా ప్రస్తుత వార్డెన్ ఆన్‌లైన్‌కే పరిమితమై, విద్యార్థులపై దృష్టి లేదని పలువురు పేర్కొంటున్నారు. గతంలో ఇదే ఆశ్రమ పాఠశాలలో 150 నుండి 200 మంది విద్యార్థులు ఉండేవారు. ప్రస్తుతం 66 మంది విద్యార్థుల‌కు తగ్గింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దళితులపై దృష్టి సారించి విద్యార్థులకు న్యాయం చేయాలని, అన్ని సదుపాయాలు ఉన్న ఈ ఆశ్రమ పాఠశాలలోనే ఉండే వార్డెన్‌ను నిర్వ‌హించి విద్యార్థుల శాతాన్ని పెంచవలసిందిగా కోరుతున్నారు.

Leave a Reply