MADHAVI | తాత్కాలిక ఉపాధ్యాయుల నియామకం

MADHAVI | తాత్కాలిక ఉపాధ్యాయుల నియామకం
MADHAVI | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని చిన్నపోర్ల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత నేపథ్యంలో నలుగురు తాత్కాలిక ఉపాధ్యాయులను (విద్యా వాలంటీర్లను) ఇవాళ నియమించినట్లు ఊట్కూర్ మండల విద్యాశాఖ అధికారిని మాధవి తెలిపారు. ఉపాధ్యాయుల కొరత తీర్చాలని సర్పంచ్ గాండ్ల నికిత ప్రశాంత్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు కోరడంతో ఉపాధ్యాయులను నియమించినట్లు తెలిపారు. విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంఈఓ కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల నికిత ప్రశాంత్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శశిరేఖ, ఉపాధ్యాయుడు నరసింహులు వార్డు సభ్యుడు బందే నవాజ్, తదితరులు పాల్గొన్నారు.
