solution | మల్లన్న ఆలయ అభివృద్ధికి తోడ్పాటునందిస్తా

solution | మల్లన్న ఆలయ అభివృద్ధికి తోడ్పాటునందిస్తా

  • మాజీ జెడ్పీటీసీ మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి

solution | చేవెళ్ల, ఆంధ్రప్రభ : మల్లన్న దేవాలయం అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని చేవెళ్ల మాజీ జెడ్పీటీసీ మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి(Marpalli Malathi Krishna Reddy) వెల్లడించారు. గురువారం చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న మల్లన్న ఆలయంకు తన వంతుగా ఐదు లక్షల రూపాయల చెక్కును విరాళంగా ఆలయ కమిటీకి అందజేశారు.

ఈసందర్భంగా మాలతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతనతోనే విశ్వమానవ కళ్యాణం జరుగుతుందన్నారు. దైవచింతనతో మానసిక ప్రశాంతత(mental peace) లభిస్తుందని తెలిపారు. సమాజంలో నైతిక విలువలు సైతం పెంపొందుతాయన్నారు. అదేవిధంగా చేవెళ్ల మున్సిపల్ పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారాని(solution)కి ముందుంటానని వివరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆయనను ఘనంగా సన్మానించింది.

ఈకార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సున్నపు వసంతం, గుండాల రాములు మాజీ సర్పంచ్ వెంకటమ్మ విట్టలయ్య, నాయకులు జూకన్న లక్ష్మారెడ్డి, బేగరి వెంకటేష్, మద్దెల మల్లేష్, గజ్జల నర్సింలు, దండు సత్యం కె.మల్ రెడ్డి, మధ్యల జంగయ్య, పొట్ట దయాకర్, తదితరులు ఉన్నారు.

Leave a Reply