visible policing | ఫిర్యాదుల‌పై స్పందించాలి

visible policing | ఫిర్యాదుల‌పై స్పందించాలి

  • బాపట్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

visible policing | బాపట్ల క్రైమ్, ఆంధ్రప్రభ : వార్షిక తనిఖీల్లో భాగంగా ఈ రోజు బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఉమామహేశ్వర్ తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు రికార్డ్స్ ప‌రిశీలించారు. వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసుల(Women Police) వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అసాంఘిక కార్యక్రమాల పట్ల నిరంతరం నిఘా ఉంచి పర్యవేక్షించి సమాచారాన్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు రిపోర్టు చేయాలని వారికి సూచించారు. ఐక్యరాజ్యసమితి నూతన సంవత్సరాన్ని మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించిందని తెలిపారు. సంఘవిద్రోహులు రౌడీ షీటర్లు, నేరస్తులపై నిఘా పెంచి క్రైమ్ రేట్‌(crime rate)ను తగ్గించే విధంగా కృషి చేయాలని వారికి ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. అధికారులు సిబ్బంది అంకితభావంతో విధులను నిర్వహించాలన్నారు. నేరాల నియంత్రణకు పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్టణంలో విసిబుల్ పోలీసింగ్(visible policing) అమలు చేయాలని, అధికారులు తమకు కేటాయించిన వార్డులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పట్టణంలో తరచూ పర్యటిస్తూ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు.

ఏదైనా సంఘటనను జరిగితే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. సిబ్బంది టెయిల్ 100కు కాల్ రాగానే వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని సమస్యలు పరిష్కరించాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా సేవించడం వంటి వాటిపై అసాంఘిక కార్యక్రమాలపై నిరంతరం నిఘా ఉంచుతూ కట్టడి చేయాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ రామాంజనేయులు, పట్టణ సీఐ రాంబాబు, ఎస్సై విజయ్ కుమార్, మహిళ ఎస్సై చంద్రావతి సిబ్బంది ఉన్నారు.

Leave a Reply