Rythu Ratna Award | రైతులకు అవగాహన…

Rythu Ratna Award | రైతులకు అవగాహన…

Rythu Ratna Award | చిట్యాల, ఆంధ్రప్రభ : సమీకృత వ్యవసాయ విధానాలను పాటించడం వల్ల రైతులు అధిక లాభాలను పొందవచ్చు అని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారిని సుభాషిని తెలిపారు. మంగళవారం చిట్యాల మండలం తాళ్ల వెల్లంల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారిని సుభాషిని ముఖ్యఅతిథిగా హాజరై కూరగాయల సాగులో రైతులు పాటించవలసిన మెలకువలను, బిందు సేద్య విధానం, పండించిన కూరగాయలను మార్కెటింగ్ చేసుకునే విధానం, ఎఫ్ పి ఓల ఏర్పాటు ఉపయోగాలను రైతులకు వివరించారు.

సమీకృత వ్యవసాయ విధానం(Agricultural policy) పాటించడం వలన అధిక లాభాలను పొందవచ్చు అని, పందిళ్లపై కూరగాయల సాగు గురించి కూలంకషంగా వివరించడంతోపాటు, ఉద్యాన శాఖ నుండి కూరగాయలకు అందించే రాయితీలను గురించి రైతులకు తెలియజేశారు. అనంతరం రైతు రత్న అవార్డు(Rythu Ratna Award) గ్రహిత పజ్జూరి అజయ్ కుమార్ రెడ్డి అరటి తోటను సందర్శించి పలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో మండల ఉద్యాన అధికారి శ్వేత, విస్తరణ అధికారి రహీం, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, డ్రిప్, ఆయిల్ ఫామ్ కంపెనీ ఎఫ్ పి ఓ ప్రతినిధులు శేఖర్, వినయ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply