Raj Bhavan | గవర్నర్‌ను ఆహ్వానించిన యాదగిరిగుట్ట దేవస్థాన అధికారులు

Raj Bhavan | గవర్నర్‌ను ఆహ్వానించిన యాదగిరిగుట్ట దేవస్థాన అధికారులు

Raj Bhavan | యాదగిరికొండ, ఆంధ్రప్రభ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించ తలపెట్టిన వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు, అధ్యయనోత్సవాలకు రావాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnu Dev Verma)కి సాదర ఆహ్వానం అందింది.

నేడు జరిగే వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి విచ్చేయాలని కోరుతూ ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎస్. వెంకటరావు రాజ్‌భవన్‌(Raj Bhavan)లో గవర్నర్ ని కలిసి ఆహ్వాన పత్రికను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు, ఉప ప్రధాన అర్చకులు మాధవాచార్యులు మరియు వారి అర్చక బృందం గవర్నర్ ని వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనాలు అందజేశారు.

అనంతరం స్వామివారి పవిత్ర తీర్థ ప్రసాదాలను అందజేసి వారిని ఘనంగా సత్కరించారు. ఈ ఆహ్వాన కార్యక్రమంలో దేవస్థాన అధికారి వివేక్ తో పాటు ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను ఈ సందర్భంగా అధికారులు గవర్నర్ కి వివరించి, క్షేత్ర సందర్శన ద్వారా భక్తులకు మరియు ప్రజలకు శుభం చేకూరాలని ఆకాంక్షించారు.

Leave a Reply