Medicity Hospitals | పూర్తిస్థాయిలో సూపర్ స్పెషాలిటీ సేవలు

Medicity Hospitals | పూర్తిస్థాయిలో సూపర్ స్పెషాలిటీ సేవలు

  • నేడు అన్ని సదుపాయాలతో కూడిన సరికొత్త సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ప్రారంభం

Medicity Hospitals | మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ పరిసర ప్రాంతాలకు గత రెండు దశాబ్దాలుగా ఆరోగ్య సేవలు అందిస్తున్న మెడిసిటి ఇన్సిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ అనుబంధ మెడిసిటి హాస్పిటల్స్(Medicity Hospitals) వారు జనవరి నుండి సూపర్ స్పెషాలిటీ సేవలను పూర్తి స్థాయిలో అందించనున్నారు.

ఇందుకోసం నేటి ఉదయం ప్రత్యేక సదుపాయాలతో కూడిన సరికొత్త సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ను హాస్పిటల్ ఆవరణలో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఫేర్ మెడికల్ కేర్ ఫౌండేషన్ సభ్యులు వి యస్ వి ప్రసాద్, వ్యవస్థాపకులు, లోటస్ గ్రూప్ ఆప్ హాస్పిటల్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అండ్ జి.శ్రీనివాస రాజు హాజరై సాంప్రదాయ పద్దతిలో పూజాదికాలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా షేర్ మెడికల్ కేర్ ఫౌండేషన్(Medical Care Foundation) ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కె శివరామ కృష్ణ మాట్లాడుతూ… గత రెండు దశాబ్దాలుగా మెడిసిటి హాస్పిటల్ పలు ఆరోగ్య సేవలను అందిస్తోందని, అయితే పూర్తిస్థాయిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించకపోలేకపోవడంతో రోగులకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుచేత వీటిని రోగులకు అందుబాటులోకి తెచ్చామని వివరించారు.

ప్రస్థుతం కార్డియాలజీ, న్యూరాలజి, యూరాలజీ, వ్యాస్కులర్ సర్జరీ(Vascular Surgery) వంటి సేవలను అందుబాటులోకి తెచ్చామని, త్వరలోనే ఇతర సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈప్రారంభోత్సవ కార్యక్రమంలో వి యస్ వి ప్రసాద్, వ్యవస్థాపకులు, లోటస్ గ్రూప్ ఆప్ హాస్పిటల్స్(Lotus Group of Hospitals) ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ తో పాటూ జి శ్రీనివాస రాజు, షేర్ మెడికల్ కేర్ ఫౌండేషన్ సభ్యులు – ఫ్రొఫెసర్ కె శివరామ కృష్ణ, ప్రెసిడెంట్, షేర్ మెడికల్ కేర్ ఫౌండేషన్ అండ్ మెడిసిటి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – ఐనిష్ మర్చంట్, ముఖ్య కార్యనిర్వహణాదికారి, మెడిసిటి హాస్పిటల్స్ – డా. దేవేంద్ర సింగ్ నేగి, ప్రన్సిపాల్, మెడిసిటి ఇన్సిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ – డా. గీత, మెడికల్ డైరెక్టర్, మెడిసిటి హాస్పిటల్ తో పాటూ పలువురు వైద్య విభాధిపతులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply