Abhilasha Abhinav | యూరియాపై ఆందోళన వద్దు

Abhilasha Abhinav | యూరియాపై ఆందోళన వద్దు
- కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
- ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత లేకుండా చూడాలి
- జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
Abhilasha Abhinav | నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లాలో యూరియా కొరత ఏమాత్రం లేదని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అలాగే ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత లేకుండా చూడాలని అధికారులకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. యూరియా నిల్వలు, సరఫరా తీరుపై అధికారులతో సమీక్షించిన అనంతరం ఇవాళ కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో ప్రస్తుతం రైతుల అవసరాలకు అనుగుణంగా 8వేల మెట్రిక్ టన్నుల (MT) యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొందరు వ్యాపారులు, దళారులు కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను భయాందోళనకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ వేగాలను మరింత పెంచాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్లకు గ్రామాల్లో ఎటువంటి ఇసుక కొరత లేకుండా తహసీల్దార్ చూడాలని పేర్కొన్నారు. కొందరు ఇసుక రీచ్ ల పేరిట కృత్రిమ కొరత సృష్టించేందుకు పన్నాగాలు పన్నితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
