Toxic | కేజీఎఫ్ యశ్ నిర్ణయం సరైనదేనా..?

Toxic | కేజీఎఫ్ యశ్ నిర్ణయం సరైనదేనా..?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టాక్సిక్. ఈ సినిమా పై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్(Expectations) రోజు రోజుకీ పెరుగుతున్నాయి. అయితే.. కేజీఎఫ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించడంతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. దీంతో నెక్ట్స్ మూవీ ఏ స్టార్ డైరెక్టర్ తో చేస్తాడా అని ఎదురు చూసిన సినీ అభిమానులకు లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్(Lady director Geetu Mohandas) తో సినిమాను అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. ఇది సరైన నిర్ణయమేనా..? ఈ క్రేజీ మూవీ అప్ డేట్ ఏంటి..? టాక్సిక్ థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు..?
Toxic | ఇలా చేయడం ప్రయోగమే..

యశ్ సినిమా చేస్తానంటే.. చేసేందుక టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ డైరెక్టర్స్ రెడీగా ఉన్నప్పటికీ.. మలయాళ డైరెక్టర్(Malayalam Director) అది కూడా లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తో సినిమా చేయడం అంటే.. ఇది ఒక ప్రయోగమే అని చెప్పచ్చు. ఆమె భారీ సినిమాలు తీసిన అనుభవం ఉందా అంటే లేదు.. పైగా ఎక్కువ సినిమా(Fewer movies)లు తీసిందా అంటే.. రెండు సినిమాలే తీసింది. అయినప్పటికీ.. గీతూ మోహన్ దాస్ తో యశ్ సినిమా చేయడం అంటే.. మామూలు విషయం కాదు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా డిఫరెంట్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తుంది. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లింప్స్ కు అనుకున్నంతగా ఫీడ్ బ్యాక్(Feedback) అయితే రాలేదు అనేది వాస్తవం.
Toxic | క్రేజ్ పెంచేసిన ఫస్ట్ లుక్..

టాక్సిక్ అప్ డేట్ విషయానికి వస్తే.. తాజాగా మేకర్స్ సినిమాలో ఎలిజిబెత్ పాత్రలో నటిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి ఫస్ట్ లుక్(Qureshi first look)ను విడుదల చేశారు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న హుమా ఖురేషి.. టాక్సిక్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం సినిమా పై ఆసక్తిని మరింత పెంచింది. ఫస్ట్ లుక్‌ను గమనిస్తే.. ఆమె పాత్రలో మిస్టరీ, ఇంటెన్సిటీ(Mystery, intensity) అర్థమవుతోంది. 2026లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ పై లేటెస్ట్‌గా హుమా ఖురేషి ఫస్ట్ లుక్‌తో బజ్ మరింత పెరిగింది. హుమా ఖురేషి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తే.. ఆమె బ్లాక్ కలర్ డ్రెస్(Black color dress) వేసుకుని ఓ వింటేజ్ బ్లాక్ కారు ముందు నిలుచుని ఉంది. వెనుక మైపు సమాధి రాళ్లు, రాతి దేవదూత విగ్రహాతో శ్మశానం ఉన్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ తరహా బ్యాక్‌డ్రాప్ ఒక భయానకమైన వాతావరణాన్ని తలపిస్తోంది. సినిమా పై మరింతగా ఆసక్తిని పెంచుతుంది.
Toxic | టాలెంటెడ్ పవర్ హౌస్..

చిత్ర దర్శకురాలు గీతూ మోహన్ దాస్ హుమా ఖురేషి పాత్ర గురించి తన సోషల్ మీడియా(Social media) ద్వారా స్పందిస్తూ.. ఈ పాత్రకు ఎవర్ని ఎంపిక చేయాలా అనేది నాకు చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే.. ఈ క్యారెక్టర్‌లో నటించే వారి నటనా సామర్థ్యం, బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఓ డిఫరెంట్ లుక్(Different look) తీసుకురావాల్సి ఉంటుంది. ఎప్పుడైతే హుమా ఫ్రేమ్‌లోకి అడుగుపెట్టిందో.. ఆ క్షణం నుంచే ఆమెలో ఏదో ప్రత్యేకమైన, అరుదైన గుణం ఉందని గమనించాను. ఆమె సహజమైన స్టైల్, ఇంటెన్సిటీ, ఎలిజబెత్ పాత్రకు ప్రాణం పోసేలా చేసింది. హుమా ఒక అద్భుతమైన నటి. హుమా ఓ టాలెంటెడ్ పవర్ హౌస్(Talented Powerhouse). ఈ పాత్రతో ఆమె వెండి తెర పై ఒక డిఫరెంట్, స్ట్రాంగ్, ఎఫెక్టివ్ వ్యక్తిత్వాన్ని ఎలివేట్ చేసింది. ఐ లవ్ యు హుమా ఖురేషి అంటూ గీతూ మోహన్ దాస్ స్పందించారు.
Toxic | అంతర్జాతీయ స్థాయిలో.. టాక్సిక్..

యష్, గీతూ మోహన్‌దాస్ కలిసి ఈ కథను రాసారు. ఈ భారీ చిత్రాన్నిఇంగ్లీష్, కన్నడ భాషల్లో(In English and Kannada languages) ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా మరికొన్ని భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. దీంతో ఈ చిత్రం పై అంతర్జాతీయ స్థాయి(International level)లో భారీ అంచనాలున్నాయి. అద్భుతమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాను 2026లో మార్చి 19న ఈద్, ఉగాది, గుడి పడ్వా పండుగలు కలిసి వచ్చేలా లాంగ్ వీకెండ్ సమయంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. గీతూతో యశ్ సినిమా చేయడం సరైన నిర్ణయం కాదనే టాక్ అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీ జనాల్లో ఉంది. మరి.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి తను కేజీఎఫ్ తర్వాత లేడీ డైరెక్టర్ గీతూ(Lady Director Geethu)తో సినిమా చేయడం అనేది సరైన నిర్ణయమే అని యశ్ నిరూపిస్తాడేమో చూడాలి.
