80 lakhs | సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

80 lakhs | సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
- కోనంపేట–కుష్నపల్లి మధ్య రవాణాకు ఊతం
80 lakhs | నెన్నెల, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు నెన్నెల మండలంలోని కోనంపేట గ్రామపంచాయతీ పరిధిలో కోనంపేట నుంచి కుష్నపల్లి వరకు రూ.80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం అధికారికంగా ప్రారంభించారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా ఈ రహదారి నిర్మాణం చేపట్టడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సీతారాం, ఉపసర్పంచ్ తిరుపతి రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తోడే రాజేశ్వర్ రెడ్డి, శ్రీ తోడే బాపు రెడ్డి, ప్రతాప్ రెడ్డి, సంతోష్, భీమయ్య, బిక్కయ్య తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, తమ గ్రామంలో రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామానికి వెళ్లే ప్రధాన మార్గంలో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయితే రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని, ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే బురద, రాకపోకల ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సీసీ రోడ్డు నిర్మాణంతో కోనంపేట, కుష్నపల్లి గ్రామాల మధ్య అనుసంధానం బలపడనుండగా, రైతులు, విద్యార్థులు, దినసరి కూలీలకు ఎంతో ప్రయోజనం చేకూరనుందని స్థానికులు పేర్కొన్నారు.
