Kurnool | ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్

Kurnool | ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్

  • ఉత్సాహంగా పాల్గొన్న పోలీస్ సిబ్బంది

Kurnool | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ పోలీసు సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపింది. ఆదివారం కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ మైదానంలో సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ పోలీసు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను కర్నూలు జిల్లా ఎస్పీ, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్ కలిసి ప్రారంభించారు. పోలీసు సిబ్బందితో కలిసి క్రికెట్ ఆడి వారు ఉత్సాహపరిచారు. జిల్లా సివిల్, ఏఆర్ పోలీసు జట్టుకు జిల్లా ఎస్పీ కెప్టెన్‌గా వ్యవహరించగా, ఏపీఎస్పీ పోలీసు జట్టుకు 2వ బెటాలియన్ కమాండెంట్ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఏపీఎస్పీ 2వ బెటాలియన్ జట్టు విజేతగా నిల‌వగా, కర్నూలు జిల్లా పోలీసు జట్టు రన్నర్‌గా నిలిచింది.

Kurnool

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…పోలీసులు రోజూ శాంతిభద్రతల పరిరక్షణలో తీవ్ర ఒత్తిడితో విధులు నిర్వర్తిస్తారని, అలాంటి ఒత్తిడిని తగ్గించు కోవడానికి క్రీడలు ఎంతో ఉపకరిస్తాయని తెలిపారు. శారీరక దృఢత్వం, మానసిక ఉత్సాహం పెరగాలంటే క్రీడలు తప్పనిసరి అన్నారు. గెలుపు–ఓటములు సహజమేనని, పాల్గొనడమే ముఖ్యమని పేర్కొన్నారు.

Kurnool

ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్ మాట్లాడుతూ… సంవత్సరం పొడవునా బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యే పోలీసులకు విశ్రాంతి, ఉత్సాహం కల్పించడమే లక్ష్యంగా ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించినట్లు తెలిపారు. శారీరక ఫిట్‌నెస్‌తో పాటు ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ బాబు ప్రసాద్, అసిస్టెంట్ కమాండెంట్లు ఎస్.ఎం. భాషా, సుధాకర్ రెడ్డి, వెంకటరమణ, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Kurnool
Kurnool
Kurnool
Kurnool
Kurnool
Kurnool

Leave a Reply