Three-Mukha – 1 | శివాజీపై హీరోయిన్ ఫైర్

Three-Mukha – 1 | శివాజీపై హీరోయిన్ ఫైర్
- ఆయన మాటలు మహిళల స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాయి
- త్రిముఖ హీరోయిన్ దాసరి సాహితి ఆగ్రహం
Three-Mukha – 1 | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ఇటీవల హీరోయిన్లు వస్ర్తధారణపై సీనియర్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై త్రిముఖ హీరోయిన్ సాహితీ దాసరి స్పందించారు. నటుడు శివాజీ మాటలను సాహితి విభేదించారు. త్రిముఖ సినిమా(Three-Mukha – 1) ప్రమోషన్లో భాగంగా మచిలీపట్నం వరం సెంట్రల్ మాల్‌కు వచ్చిన సాహితీ దాసరి విలేకరులతో మాట్లాడుతూ నటుడు శివాజీ మహిళలపై మాట్లాడిన వ్యాఖ్యలను ఖండించారు.
మహిళలు(women) ఎలాంటి వస్త్రాలు ధరించాలో మహిళలకు పూర్తిగా అవగాహన ఉందని, దీనిపై శివాజీ ప్రత్యేకంగా ఎవర్ని ఉద్దేశించి మాట్లాడిన అవసరం లేదని ఆమె అన్నారు. ఒకరు బాగున్నారు అని చెప్పడానికి ఇంకొకరిని తక్కువ చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. మహిళలు ఇలాగే ఉండాలని నిర్ణయించడానికి ఆయనకు ఉన్న అర్హత ఏమిటని ప్రశ్నించారు.
ఎవరికి నచ్చినట్టు వారు ఉండటం స్వేచ్ఛకు చిహ్నం అని అన్నారు. శివాజీ మాటలు మహిళల స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని మాట్లాడారు. సినీ రంగంలో వస్త్రధారణ కు చాలా ప్రాధాన్యత ఉందన్నారు. శివాజీ మాట్లాడిన మాటలను విభేదించారు. దాసరి సాహితీ గతంలో పోలిమేర(Similarities) 1, పొలిమేర 2 సినిమాలో నటించారు.
