CPI | పేదలకు అండగా ఎర్రజెండా

CPI | పేదలకు అండగా ఎర్రజెండా
- సైతాంతిక రాజకీయ పునాదుల పునాదులు నిర్మించడమే నివాళి
- సీపీఐ (ఎంఎల్) మాస్లాం పార్టీ జిల్లా నాయకులు కిరణ్
CPI | ఊట్కూర్, ఆంధ్రప్రభ : దేశంలో బలమైన ఐక్య విప్లవ కమ్యూనిస్టు పార్టీని సరైన సిద్ధాంతిక రాజకీయ పునాదుల మీద నిర్మించడమే అమరులకు నిజమైన నివాళి అని నారాయణపేట సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు కిరణ్, డివిజన్ నాయకులు సలీం అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా పెద్దపోర్ల, బిజ్వార్ గ్రామాల్లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వందేళ్లు కావడంతో భారీ ర్యాలీలు ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీకి నేటికి సరిగ్గా 100 ఏళ్లు పూర్తవుతుందన్నారు. వందేళ్లు పోరాట చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్టు పార్టీ జయపజయాలని ఎదురుచూసి నేటికీ పేదల పక్షాన నిలబడి దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడుతుందని అన్నారు.

ఆయా కార్యక్రమాల్లో నాయకులు వెంకట్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, కొర్ల నరసింహులు, రాము ఎల్లప్ప,కనక రాయుడు కోళ్ల కృష్ణయ్య లింగప్ప అంజప్ప శీల కృష్ణయ్య గుర్రాల తిప్పయ్య అరుణ్ బాలాంజప్ప బాలకృష్ణప్ప కొండగట్టు అంజప్ప పెద్ద బాలప్ప బుడ్డ కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.
