Indrakeeladri | ఇంద్రకీలాద్రి కిట‌కిట

Indrakeeladri | ఇంద్రకీలాద్రి కిట‌కిట

  • అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు
  • పూర్తిగా నిండిన క్యూ లైన్లు
  • సామాన్య భక్తులకు పెద్దపీట
  • 2 గంటలపాటు వీఐపీ సిఫార్సు దర్శనాలు రద్దు
  • విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు

Indrakeeladri | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : విజయవాడలోనే ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. గురువారం సెలవు రోజు కావడంతో అమ్మవారి దర్శనానికి వేలాదిగా తరలివచ్చిన భక్తుల రాకతో ఇంద్రకీలాద్రి(Indrakeeladri) కిక్కిరిసింది.

గురువారం తెల్లవారుజాము నుంచి భక్తుల రాక క్రమక్రమంగా పెరగడంతో అన్ని క్యూ లైన్‌లలో భక్తులు రద్దీగా కనిపించారు. భక్తుల కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. దేవస్థానంలోని అధికారులకు సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించిన ఈవో స్వయంగా పర్యవేక్షించారు. భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాలలో రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఆయా ప్రాంతాలలో ఏఈఓ లకు సూపరింటెండెంట్‌లకు ప్రత్యేక విధులను కేటాయించారు.

సామాన్యులకే పెద్దపేట..

అమ్మవారి ఆలయానికి భక్తుల రాక క్రమంగా పెరిగిన నేపథ్యంలో ముందస్తు చర్యలలో భాగంగా మధ్యాహ్నం రెండు గంటల పాటు వీఐపీ సిఫార్సు దర్శనాలను అధికారులు రద్దు చేశారు. క్యూలైన్ల(queues)లో భక్తులను త్వరగా పంపించే క్రమంలో 500 రూపాయల టికెట్లను జారీ చేయడం కూడా నిలుపుదల చేసి సామాన్య భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని త్వరగా అయ్యేలా చర్యలు చేపట్టారు. ఈఓ శీనా నాయక్ ఆలయంలోని రద్దీ ప్రదేశాలలో పర్యటిస్తూ అక్కడ భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తూ భక్తులతో స్వయంగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

Leave a Reply