British | కూ.. చుక్‌చుక్!
- చకచకా రైల్వే డబ్లింగ్ పనులు
- గుంటూరు గుంతకల్ రైల్వే లైన్ పనులు వేగవంతం
British | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : దక్షిణ మధ్య రైల్వే శాఖ పరిధిలోని గుంటూరు – గుంతకల్లు రైల్వేమార్గం డబ్లింగ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. గురువారం నంద్యాల మండలం పెద్ద కొట్టాల, పొన్నాపురం గ్రామాల మధ్య వేగంగా జరుగుతున్న పనులను అధికారులు పరిశీలించారు.
గుంటూరు – గుంతకల్లు మధ్య బ్రిటిష్(British) కాలంలో ఏర్పాటు చేసిన మీటర్ గేజ్ రైలు మార్గాన్ని నంద్యాల పార్లమెంట్ సభ్యులుగా విజయం సాధించి భారత ప్రధాన మంత్రిగా బాధ్యత చేపట్టిన వెంటనే ఆప్పటి నంద్యాల పార్లమెంట్ సభ్యుడైన పి.వి.నరసింహరావు గుంటూరు నుంచి గుంతకల్లు రైలు మార్గాన్ని బ్రాడ్‌గేజ్(broad gauge)గా మార్చారు. తదనంతర భారత ప్రధానులు అటల్ బిహారి వాజ్‌పేయ్, మన్మోహన్‌సింగ్‌లు గుంటూరు నుంచి నంద్యాల మీదుగా గుంతకల్లు వరకు రైలు మార్గాన్ని డబ్లింగ్‌గా మంజూరు చేశారు.
అయితే భారత ప్రధాన మంత్రిగా బాధ్యత చేపట్టిన నరేంద్ర మోడీ ప్రభుత్వం గుంటూరు – గుంతకల్లు రైలు మార్గాన్ని డబ్లింగ్(doubling) తో పాటు విద్యుత్ రైలు మార్గంగా మంజూరు చేసి వాటికీ అవసరమైన నిధులు కూడా విడుదల చేయడంతో డబ్లింగ్ రైలు మార్గం, విద్యుదీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి.

డబ్లింగ్ పనులతో రైళ్ల రాకపోకలకు మరింత సులభతరమైంది. ఈ పనులు వేగంగా జరిగేందుకు కేంద్ర ప్రభుత్వము ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తూ వస్తుంది. వచ్చే మార్చి నాటికి అన్ని లైన్లో పూర్తి చేయాలన్న సంకల్పంతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

