Encounter | ఇద్దరు మావోయిస్టులు మృతి

Encounter | ఇద్దరు మావోయిస్టులు మృతి
వారిపై రు. 23.65 లక్షల రివార్డ్
Encounter | చర్ల, ఆంధ్రప్రభ : ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బెల్గర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి (Two Maoists killed) చెందారు. మృతి చెందిన వారిని ఏసీఎం బారి (Bari), బీపీఎం అమరిత్ (Amarit) గా గుర్తించారు.
వీరు సివిల్ డ్రెస్ (Civil dress) లో ఉండి మావోలకు అవసరమయ్యే వస్తువులు సరఫరా చేసే టీమ్ గా గుర్తించినట్లు తెలిపారు. వీరి వద్ద నుండి ఒక రివాల్వర్, ఒక 303 రైఫిల్, వాకీటాకీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై రూ.23.65 లక్షల రివార్డ్ ఉన్నట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
