
35days | సుదీర్ఘ కాలం పరీక్షలు
35days | సుదీర్ఘ కాలం పరీక్షలు
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఈ మధ్యకాలంలో పదవ తరగతి పరీక్ష విధానంలో జరుగుతున్న మార్పులు విద్యార్థులు, ఉపాధ్యాయులే కాక విద్యావేత్తలలో కూడా ఆందోళన కలిగిస్తుంది. కరోనా కాలంలో(During the Corona period) పాఠశాల పని దినాలు తక్కువగా ఉండటం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గిం చడం కోసం తాత్కాలికంగా పాఠ్యాంశాలు తగ్గిస్తూ 11 పేపర్లుగా ఉన్న పదవ తరగతి పరీక్షను ఆరు పేపర్లకి తగ్గించారు.
ఈ మార్పు కరోనా కాలంలో సరైనదిగానే భావించిన తర్వాత కాలంలో పాఠ్యాంశాలు కుదింపు చేయకుండా 6 పేపర్ల విధానాన్ని కొనసాగించడం వల్ల విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం 7 పరీక్షలను 35 రోజుల సుదీర్ఘకాలం(for a long time)పాటు నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేయడంతో విదార్థుల్లో, ఉపాధ్యాయుల్లో మానసిక ఆందోళన మొదలైంది.
35days | విద్యార్థుల్లో, ఉపాధ్యాయుల్లో ఒత్తిడి

ప్రస్తుతమున్న పాఠ్యపుస్తకాలు కరోనాకాలం కన్నా ముందున్న 11 పేపర్లలకు(For 11 papers) కనుగుణంగా రాయబ డ్డాయి. కానీ కరోనా కాలంలో పరీక్షా విధానాన్ని ఆరు పేపర్లకు తాత్కాలికంగా తగ్గించిన తర్వాత పాఠ్యాంశాలు కుదించకుండా తగ్గించిన ఆరు పేపర్ల విధానాన్ని కొనసాగించడంతో విద్యార్థుల్లో మరియు ఉపాధ్యాయుల్లో ఒత్తిడి పెరిగింది. ఉదాహరణకు సాంఘిక శాస్త్రం(Social science) లో మొత్తం 21 పాఠ్యాంశాలు ఉన్నాయి.
వాటికి రెండు పేపర్లతో పరీక్ష(Examination with papers) విధానం ఉండేది. విద్యార్థులు 1 నుంచి 11 పాఠ్యాంశాలకు మొదటి పేపర్, 12 నుంచి 21 పాఠ్యాంశాలకు రెండో పేపరు పరీక్ష రాసేవారు. ఇది హేతుబద్ధంగా, శాస్త్రీయంగా ఉండేది. అయితే ప్రస్తుతం 21 పాఠ్యాంశాలకుగాను ఒకే సాంఘిక శాస్త్ర పరీక్ష, అందులో 18 ప్రశ్నలు మాత్రమే ఉండడంతో కనీసం ఒక పాఠ్యాంశం(Textbook) నుంచి ఒక ప్రశ్న కూడా లేని విధంగా ప్రశ్నాపత్రం ఉండడంలో శాస్త్రీయత ఉందా? సాంఘిక శాస్త్రా మూల్యాంకనానికి ఒక పేపర్ ఉండాలన్నప్పుడు 21 పాఠ్యాంశాలలో కనీసం ఐదు పాఠ్యాంశాలైన తగ్గించాల్సింది.
ప్రస్తుత విద్యా సంవత్సరానికిగాను పదవ తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించాలని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(Board of Secondary Education) వారు విడుదల చేసిన షెడ్యూలు విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించడం అటు ఉంచితే, మానసిక ఆందోళనను పెంచుతుంది.
35days | సీబీఎస్ఈ విధానాన్ని బట్టి

ఒక సబ్జెక్టులకు 4,5 రోజుల విరామం కాకుండా ఒకటి, రెండు రోజుల విరామం ఉండాల్సింది. పరీక్షల షెడ్యూలు తయారు చేసే ముందు ఫీల్డ్‌లో అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సలహాలు(Teacher advice) తీసుకొని ఉండాల్సింది. ఏకంగా 35 రోజులపాటు పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తే అన్ని రోజుల పాటు విద్యార్థులు పరీక్షపై దృష్టిని నిలిపి ఉంచలేరు. ఇది విద్యార్థుల్లో ఒక రకమైన నిరుత్సాహాన్ని పెంచుతుంది.
పరీక్షల మధ్య ఎక్కువ వ్యవధి ఉండడంతో, విద్యార్థులు బయట తిరగడంవల్ల అనారోగ్యానికి గురైతే, ఇది మొత్తంగా పరీక్షలపై తీవ్రప్రభాతం(Extreme stress on exams) చూపే అవకాశం ఉంటుంది. సీబీఎస్ఈ విధానాన్ని బట్టి పదవ తరగతి షెడ్యూల్(Class schedule) తయారు చేసినట్లు తెలుస్తున్నది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని లోతుగా అధ్యయనం చేయాల్సి ఉండేది. సీబీఎస్ సి విద్యార్థుల సామాజిక, ఆర్థిక పరిస్థితులు వేరు.
ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ, మోడల్ స్కూల్ విద్యార్థుల సామాజిక, ఆర్థిక పరిస్థితులు వేరు. సీబీఎస్ఈలో చదువుతున్న విద్యార్థుల్లో మెజార్టీ(The majority of students)గా అర్బన్ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉంటారు. అందులో తల్లిదండ్రులు అక్షరాసులై ఉంటారు. అదే ప్రభుత్వ, జిల్లా పరిషత్, కెజీబీవీ, మోడల్ స్కూల్ తదితర సంస్థలలో చదివే విద్యార్థులు పూర్తిగా గ్రామీణ ప్రాంతాలలో ఉంటారు.
తల్లిదండ్రులలో నిరక్షరాస్యులే ఎక్కువగా ఉంటారు.7 పరీక్షలకు 35 రోజుల టైమ్ టేబుల్లో మధ్యలో విరామం ఎక్కువగా ఉండటం వల్ల గ్రామీణ ప్రాంత(Rural area) విద్యార్థులు పనులకు వెళ్ళవలసి రావడంతో చదువుపై దృష్టి కేంద్రీకరించలేరు. తల్లిదండ్రులు కూడా అన్ని రోజులు విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించలేరు, వారికి కావలసిన సౌకర్యాలు అందించలేరు. ఇది మొత్తంగా పరీక్ష ప్రిపరేషన్(Exam preparation) విధానాన్నీ దెబ్బతిసే అవకాశం ఉంది.
35days | ఒకేసారి పరీక్షలకు సంసిద్ధం
ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ, మోడల్ స్కూల్ లాంటి పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరు నెల రోజులపాటు పదో తరగతి పరీక్షల్లో నిమగ్నమైతే హోం పరీక్షలపై ప్రభావం పడుతుంది. హోం పరీక్షలకు(For home exams) విద్యార్థులను సంసిద్ధులను చేయాలన్నా, పరీక్షలను గుణాత్మకంగా నిర్వహించాలన్నా సబ్జెక్ట్. ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలి. 35 రోజులపాటు పదో తరగతి పరీక్షలు నిర్వహించిన వెంటనే మూల్యాం కనానికి సీనియర్ ఉపాధ్యాయులు(Senior teachers) వెళ్ళవలసి ఉంటుంది.ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ, మోడల్ స్కూల్ లాంటి పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరు నెల రోజులపాటు పదో తరగతి పరీక్షల్లో నిమగ్నమైతే హోం పరీక్షలపై ప్రభావం పడుతుంది. హోం పరీక్షలకు(For home exams) విద్యార్థులను సంసిద్ధులను చేయాలన్నా, పరీక్షలను గుణాత్మకంగా నిర్వహించాలన్నా సబ్జెక్ట్. ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలి. 35 రోజులపాటు పదో తరగతి పరీక్షలు నిర్వహించిన వెంటనే మూల్యాం కనానికి సీనియర్ ఉపాధ్యాయులు(Senior teachers) వెళ్ళవలసి ఉంటుంది.
ఇది 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులను హోం పరీక్షలకు తయారు చేయడంపై ప్రభావం చూపుతుంది. 10వ తరగతి(10th grade) విద్యార్థులను 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులను ఒకేసారి పరీక్షలకు సంసిద్ధం చేయలేము. 35 రోజులు పదవ తరగతి విద్యార్థులపై దృష్టి సారించాల్సి రావడం వలన హోం పరీక్షలను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది.
సిబిఎస్సి పాఠశాలల్లో పదవ తరగతి పరీక్షల కంటే ముందు హోం పరీక్షలు నిర్వహించి, తర్వాత పదవ తరగతి పరీక్షలు నిర్వహించేవారు, ఈ నిర్వహణలో హేతుబద్దత, శాస్త్రీయత(Rationality, scientificity) ఉంది. ప్రస్తుతం విద్యా సంవత్సరం నుంచి పదవ తరగతి పరీక్షలు రెండు దఫాలుగా నిర్వహిస్తారు. మొదటి దశలో ఫిబ్ర వరిలో నిర్వహించి మార్చి, ఏప్రిల్‌లో హోం పరీక్షల్లో నిర్వహిస్తారు.
రెండవ దశ పరీక్షలు మేలో నిర్వహి స్తారు. ఈ విధానంలో కూడా హేతుబద్ధత, శాస్త్రీయత ఉంది. అయితే ఎస్ ఎస్ సి బోర్డు షెడ్యూలు(SSC Board Schedule) ప్రకారం మార్చ్ 14 న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 16 వరకు సుమారు 35 రోజులు నిర్వహిస్తారు. అదే ఏప్రిల్‌లో హోమ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. రెండు పరీక్షలు ఒకేసారి నిర్వహించాలంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.
పదవ తరగతి విద్యార్థులు 35 రోజుల పాటు పరీక్షలు రాస్తే రెసిడెన్షియల్ పాఠశాలలో హోం ఎగ్జామ్స్ రాసే విద్యార్థులపై ఆ ప్రభావం ఉంటుంది. నెల రోజుల పాటు విద్యార్థుల ఆరోగ్యాన్ని(Health of students) కాపాడడం, వారికి పరీక్షలు సక్రమంగా నిర్వహించడం కత్తిమీద సామే అవుతుంది.
సుదీర్ఘంగా ఉన్న పరీక్షల ప్రస్థానం వల్ల తదుపరి పాలిటెక్నిక్ లాంటి కాంపిటీషన్ పరీక్షలకు(For competition exams) ప్రిపేర్ కావడానికి సమయం ఉండకపోవచ్చు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు విద్యార్థులను కార్యోన్ముఖులను చేయలే గాని, కార్యహీనులను చేయరాదు.
సంస్కరణలు ఫీల్డ్ స్థాయి సమస్యలను పరిష్కరించేదిగా ఉండాలి కానీ, సమస్యలు సృష్టించేదిగా ఉండకూడదు. సంస్కరణలు స్థానిక సామాజిక,ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉండాలే గాని మరో వ్యవస్థను(Another system) అనుసరించినట్లుగా ఉండకూడదు.
పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అధిక భాగం గ్రామీణ ప్రాంత విద్యార్థులే కాబట్టి ప్రస్తుతం ప్రకటించిన 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను పునర్(Revise the schedule) సమీక్షించవలసిందిగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. వారి వినతిపట్ల ప్రభు త్వం సానుకూలంగా స్పందించాలని కోరుకుందాం.
జుర్రు నారాయణ యాదవ్
తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
