AP | నేనున్నా ..మనవరాళ్లను చదివిస్తా… ఇల్లు కట్టిస్తా: చంద్ర‌బాబు


( చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో) – చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ సందర్భంగా పెన్షన్ లబ్ధిదారుడు, కల్లు గీత కార్మికుడు వాసుకు పెన్షన్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధివారులు వాసు మాట్లాడుతూ, మా మనవరాళ్లు రక్షిత,హేమ శ్రీ ని చదివించాలి. మీరే సాయం చేయాలి. మాకు సొంతం ఇల్లు లేదు. ఇల్లు కట్టించాలి., అని అభ్యర్థించారు. మా జీవనోపాధి నిమిత్తం ఆవుల పెంపకానికి ఆర్థిక సాయం చేయాలని పెన్షన్ లబ్ధిదారుడి భార్య సెల్వీ ముఖ్యమంత్రికి విన్నవించుకుంది. ఈ కుటుంబం పరిస్థితిని చూసి తప్పని సరిగా సాయం అందిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. ఒక్కొక్కరికి రెండు లక్షలు చొప్పున, మిషన్ వాత్సల్య పథకం కింద ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ.4వేలు చొప్పున ఇద్దరూ ఆడపిల్లలకు మొత్తం రూ.8 వేలు 18 ఏళ్లు నిండే వరకు, వారి బ్యాంకు ఖాతాలకు జమ అయ్యేలా ఆర్థిక సాయం అందించేలా, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.

రెండు ఆవులిస్తా.. ఇల్లు బాగు చేయిస్తా . మరో మహిళకు సీఎం వరం

అనంతరం పెన్షన్ లబ్ధిదారురాలు వసంతమ్మకు పెన్షన్ అందచేశారు. ఈ సందర్భంగా వసంతమ్మ మాట్లాడుతూ తాము చాలా పేదవాళ్లమని ఉండడానికి ఇల్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి జీవన ఆధారం లేదని, తనకు ముగ్గురు పిల్లలని, పిల్లలను చదివించుకోవడం కూడా కష్టమవుతోందని కన్నీరు పెట్టుకున్నారు. భర్త మేస్త్రి పని చేస్తారని తెలిపారు. అమ్మాయి చదువుకు రూ. 50వేలు అందజేస్తే సరిపోతుందా? అపి వారిని చంద్రబాబు నాయుడు అడిగారు. ప్రభుత్వ వసతి గృహంలో పెట్టి చదివించాల్సిందిగా జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. ఉండడానికి మూడు సెంట్లతో ఇంటి పట్టాను ఇచ్చి, ఇంటిని కట్టిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న ఇంటిని కూడా రిపేరు చేయిస్తామన్నారు. జీవనాపాధికి రెండు ఆవులను ఇస్తామన్నారు. దీంతో పట్టరాని ఆనందంతో ఆ కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడుకు పాదాభివందనం చేశారు. అనంతరం ప్రజలకు అభివాదం చేస్తూ హరిజన వాడలో ఏర్పాటుచేసిన స్టాల్స్ ను పరిశీలించేందుకు స్టాల్స్ వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నాయకుడు,ప్రియతమ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ ఊరికి విచ్చేసారన్నా సంతోషం, పండుగ వాతావరణం ను తలపిస్తూ.. మహిళలు పిల్లలు, పెద్దలు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్వాగతం పలికారు. విద్యార్థులు, పిల్లలు, పెద్దలు చంద్రబాబునాయుడుతో ఫోటోలు దిగడానికి పోటీలు పడ్డారు. ఒక పసికందును ఎత్తుకొని చంద్రబాబు నాయుడు ఫోటో దిగారు. చంద్రబాబు నాయుడు చిరు మందహాసంతో పిల్లలందరినీ ఫోటోకు అనుమతించారు. వారిని పలకరిస్తూ వారితో ఫోటోలు దిగారు. మధ్యలో పాస్టర్లు చంద్రబాబునాయుడును ఆశీర్వదించారు.


ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి,చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గు మళ్ళ ప్రసాదరావు, ప్రభుత్వ విప్, జీడీ నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వి.ఎం థామస్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జెసి విధ్యాధరి సంబంధిత అధికారులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *