National Herald | బీజేపీ ప్రభుత్వం ను గద్దె దింపాలి

National Herald | బీజేపీ ప్రభుత్వం ను గద్దె దింపాలి

  • మోడీ, అమిత్ షా నియంతృత్వ పాలనను తరిమికొట్టాలి.
  • మంత్రి జూపల్లి కృష్ణారావు,
  • ఎమ్మెల్యేలుడాక్టర్ రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ

National Herald | నాగర్ కర్నూల్ జిల్లా, ఆంధ్ర‌ప్ర‌భ : కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేయించడం, బెదిరింపులకు పాల్పడడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తూ నరేంద్ర మోడీ(Narendra Modi) ప్రభుత్వాన్ని తరిమికొట్టే వరకు పోరాడాలని మంత్రి జూపల్లి కృష్ణారావు, పీసీసీ ఉపాధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డిలు పిలుపు ఇచ్చారు.

ఈ రోజు ఎఐసీసీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో ర్యాలీ(Rally) నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయకుమార్ రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు, పీసీసీ ఉపాధ్యక్షుడు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డిలు ధర్నాలో మాట్లాడుతూ… దేశ స్వాతంత్రానికి పూర్వం ప్రజలను చైతన్యం చేసేందుకు ఏర్పాటు చేసిన నేషనల్ హెరాల్డ్(National Herald) పత్రికను అడ్డం పెట్టుకొని కేంద్రంలోని ప్రభుత్వం ఏఐసీసీ నాయకులైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ అక్రమంగా కేసు నమోదు చేశారని కోర్టు సంబంధం లేదని తీర్పు ఇచ్చిన మనీ లాండరింగ్(Money Laundering) కేసులు నమోదు చేయడం వారి అహంకార పాలనకు నిదర్శనం అని విరుచుకుపడ్డారు.

సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీలకు ప్రధాని అవకాశం వచ్చిన ఒక విద్యావేత్తను ప్రధాని చేసి త్యాగాలు చేశారని గుర్తు చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రత్యేకించే వరకు రాష్ట్రంలో ప్రజలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చైతన్యం చేయాలని హెచ్చరించారు. తప్పుడు కేసులకు భయపడేది లేదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వినోద్ తో పాటు వివిధ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply