దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్సీఆర్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో ఉద్యోగులు డ్యూటీలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇక రోడ్లపై నీళ్లు చేరడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇక ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు, హిమపాతం భారీగా కురుస్తోంది. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో రోడ్లు మూసివేసేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కార్లు కొట్టుకుపోయాయి. ఇక రోడ్లు దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.