Train Charges hike | రైల్వే ఛార్జీల పెంపు

Train Charges hike | రైల్వే ఛార్జీల పెంపు

  • 26 నుంచి అమ‌లు

Train Charges hike | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : రైల్వే ఛార్జీల‌ను పెంచుతూ భారతీయ రైల్వేశాఖ(Department Railways) నిర్ణ‌యం తీసుకుంది. పెంచిన చార్జీలు ఈ నెల‌ 26 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా మార్పులు లోకల్, స్వల్ప దూర ప్రయాణాల టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

ఆర్డినరీ క్లాస్‌లో 215 కి.మీల దాటితే కిలో మీట‌ర్‌కు పైసా చొప్పున్న రైల్వే శాఖ పెంచింది. మెయిల్/ఎక్స్ ప్రెస్ ఏసీ, నాన్-ఏసీ రైళ్లలో కిలోమీటరకు 2 పైసలు చొప్పున చార్జీలు పెంచింది. ఇక నాన్-ఏసీ ట్రైన్లో(non-AC train) 500కి. మీ దూరం ప్రయాణించే వారు అదనంగా రూ.10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 26 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులతో రైల్వేకు దాదాపు రూ.600 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని రైల్వేశాఖ అంచనా వేస్తోంది.

Leave a Reply