కాంగ్రెస్ జెడ్పిటిసి రేస్లో ముగ్గురు ఆశావాహులు…

  • బీ ఫారం ఎవరికో దక్కే అవకాశం…?

తాడ్వాయి, ఆంధ్రప్రభ: తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో జెడ్పిటిసి టికెట్ కోసం ముందస్తు చర్చలు మొదలైనట్లు చర్చ సాగుతోంది. రాబోయే జెడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు ఆశావాహులు పోటీ పడే అవకాశం ఉందని స‌మాచారం.

జనరల్ రిజర్వేషన్ కింద రడ్డి సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారని, ఇప్పటికే వారు తమ వైఖరిని, బలాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం.

Leave a Reply