Shivani | విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..

Shivani | విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..
- డాబాపై నుండి దూకిన యువతి
- ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డిగ్రీ విద్యార్థిని
Shivani | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ మండలం చర్లపల్లి సోషల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని శివాని శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మధ్యాహ్న సమయంలో శివాని కళాశాలలోని మూడవ ఫ్లోర్ నుండి కిందకి దూకింది. శివాని స్వగ్రామం చండూరు మండలం జోగిగూడెం.
బిల్డింగ్ పై నుండి దూకిన శివానిని గుర్తించిన సహచర విద్యార్థులు, అధ్యాపకులు కలిసి వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉంది. కాగా జీవితంపై విరక్తి చెంది తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శివాని సూసైడ్ లెటర్ రాసిందని రూరల్ ఎస్సై సైదా బాబు చెప్పారు. విద్యార్థినికి తల, మెడ ప్రాంతంలో తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపై విద్యార్థులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాల్సిందిగా విద్యార్థుల డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
