తిర్యాణిలో కాంగ్రెస్ విజయభేరి..

- 17 పంచాయతీలు కైవసం.. ప్రజా పాలనకే పట్టం
- విజేతలను ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ జిల్లా నాయకుడు జువ్వాజీ అనిల్ గౌడ్
తిర్యాణి , ఆంధ్రప్రభ : మండలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. క్షేత్రస్థాయిలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టారు. ఈ నేపథ్యంలో మండలంలోని 17 స్థానాల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జువ్వాజీ అనిల్ గౌడ్ ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా గెలుపొందిన తిర్యాణి సర్పంచ్ మడవి రాజేష్, గంభీరావుపేట్ సర్పంచ్ జుమ్మడి కిష్టయ్య, కన్నెపల్లి సర్పంచ్ తుమ్మరం మాన్కు, తలండి సర్పంచ్ నైతం మంగు, రొంపల్లి సర్పంచ్ సీడం కృష్ణ, సుంగపూర్ సర్పంచ్ టెకం సురేష్, గుడిపేట్ సర్పంచ్ మడవి తులసి, నాయకపుగూడ సర్పంచ్ ఏదుల సుమలత, మందగూడ సర్పంచ్ తుమ్మరం గోపాల్, లక్ష్మీపూర్ సర్పంచ్ పోయాం రేణుక, మెస్రంగూడ సర్పంచ్ కురిసెంగ లక్ష్మి, పంగిడి మాధర సర్పంచ్ ఆత్రం రాధా, మంగి సర్పంచ్ రాయసీడం వినోద్ కుమార్, ముల్కల మంద సర్పంచ్ కూడ్మేత హనుమంతరావు అభ్యర్థులను శాలువాలతో సత్కరించి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అనిల్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని, ఆ నమ్మకమే ఈ విజయాన్ని అందించిందని పేర్కొన్నారు. తిర్యాణి మండలంలో 17 స్థానాలు గెలుచుకోవడం హర్షనీయమని, రాబోయే రోజుల్లో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. గెలుపుకు కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిత్తారి సాగర్, పెరుమండ్ల వెంకటేశం గౌడ్, బొల్లం శంకర్, ఆత్రం సక్కు యూత్ ఫోర్స్ అధ్యక్షులు ఆత్రం వినోద్ కుమార్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పున్నం హరీష్ కుమార్, వివిధ గ్రామ పంచాయతీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
