MLA | బీఆర్ఎస్‌లో చేరిక‌లు…

MLA | బీఆర్ఎస్‌లో చేరిక‌లు…

  • బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న‌ ఎస్ఎం కొత్తపల్లి సర్పంచ్
  • ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

MLA | ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : భూపాలపల్లి మండలం కొత్తపల్లి గ్రామ సర్పంచ్ ఎల్లగొండ పద్మ తిరుపతి, మారేపల్లి సూర్యప్రకాష్, ఎల్లగొండ సతీష్, దండ్రే రణపతి, మర్రి అశోక్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్ది(MLA Gandra Venkataramana Reddy) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరగా, వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ‌ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డిని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు మర్యాద పూర్వకంగా కలిశారు. భూపాలపల్లి మండలం ఎస్ఎం కొత్తపల్లి(SM Kothapalli) గ్రామ నూతన సర్పంచ్ ఎల్లగొండ పద్మ తిరుపతి, వార్డు మెంబర్లు, గణపురం మండలం సీతారాంపురం గ్రామ సర్పంచ్ తోట రాకేష్, వార్డు మెంబెర్స్ గుండు సుభాష్, జంజర్ల సుభద్ర శ్రీను, ఎంకటి దేవేందర్ తదితరులకు శుభాకాంక్షలు తెలిపి అభినందనలు తెలిపారు.

సర్పంచ్, వార్డు సభ్యులను అదే విధంగా వారి గెలుపు కొరకు కృషి చేసిన వారిని మాజీ ఎమ్మెల్యే గండ్ర శాలువ కప్పి సత్కరించారు. వారి వెంట మండల, గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply