Delimitation | డీ లిమిటేషన్ పై తలసాని ఆగ్రహం

Delimitation | డీ లిమిటేషన్ పై తలసాని ఆగ్రహం
Delimitation | హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఒక స్పష్టమైన విధానం లేకుండా డీ లిమిటేషన్ (Delimitation) పేరుతో GHMC లో డివిజన్ లను ఇష్టమొచ్చినట్లుగా ఏర్పాటు చేశారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్ల ఏర్పాటులో జరిగిన తప్పిదాలపై తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ లతో కలిసి GHMC కార్యాలయంలో కమిషనర్ కర్ణన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.

డివిజన్ ఏర్పాటు మొత్తం గందరగోళంగా ఉందని ఆయన కమిషనర్ కు వివరించారు. కార్పొరేటర్ల అభిప్రాయాలు, సూచనలను తెలుసుకోవడానికే మంగళవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వివరించారు. అనంతరం మీడియాతో తలసాని శ్రీనివాస్ (Talasani Srinivas Yadav) యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. అంత హరిబరిగా ORR లోపల ఉన్న మున్సిపాలిటీ లు, కార్పొరేషన్ లను GHMC లో విలీనం చేసి 150 ఉన్న డివిజన్ లను 300కు పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలను, ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఆఫీసులలో కూర్చొని వారికి తోచినట్లు డివిజన్ లను ఏర్పాటు చేశారని అన్నారు. డివిజన్ల సరిహద్దులలో కూడా పారదర్శకత లేదన్నారు.

మంగళవారం జరిగే కౌన్సిల్ సమావేశం (Council meeting) లో ఈ అంశంపై గట్టిగా మాట్లాడతామని చెప్పారు. ఇప్పుడున్న 150డివిజన్లకు సరియైన అధికారులు, మ్యాన్ పవర్ లేని పరిస్థితుల్లో నూతనంగా మరో 150 డివిజన్లను ఏ విధంగా పెంచారని ప్రశ్నించారు. కార్పొరేటర్లకు గుడ్ న్యూస్… డివిజన్ కు 2కోట్ల రూపాయల చొప్పున నిధులు ఇస్తామని చెప్పి హడావిడి చేసి ఇంచార్జి మంత్రులకు అప్పగించడం ఎంత వరకు సబబు అన్నారు. నగరంలోని వివిధ సందర్భాల్లో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీ లలో కూడా కేవలం తమ పార్టీకి చెందినవి మాత్రమే తొలగిస్తున్నారన్నారు. తొలగిస్తే అన్ని ఫ్లెక్సీ లను తొలగించాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ లో ఈ అంశంపై కూడా నిలదీస్తామని హెచ్చరించారు. కమిషనర్ దృష్టికి కూడా ఈ విషయాలను తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు.

