2026 Pahani | కొత్త ఏడాదిలో కొత్త పహాణీలు..

2026 Pahani | కొత్త ఏడాదిలో కొత్త పహాణీలు..
2026 Pahani | హైదరాబాద్, ఆంధ్రప్రభ వెడ్ డెస్క్ : తెలంగాణలో పదేళ్లుగా పహాణీలు ఆగిపోయాయి. ఇప్పుడు కొత్త సంవత్సరంలో ప్రభుత్వం ప్రారంభించాలి అనుకుంటుంది. అంతే కాకుండా.. అందులో కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. భూ భారతి చట్ట ప్రకారం.. గ్రామాల్లోని రెవెన్యూ రికార్డులను (Records) ఓపెన్ చేసి ఇప్పుడు సాగులో ఎవరున్నారు..? ఎంత విస్తీరణం..? అనే వివరాలతో పాటు అసలు ఈ భూమి రైతుకు ఏ విధంగా సంక్రమించింది. అనే కీలక సమాచారాన్ని కూడా నమోదు చేయనున్నారు.
2026 Pahani | రికార్డుల వ్యవస్థకు డిజిటల్ భద్రత
2014 నుంచి ఆగిపోయిన మ్యాన్యువల్ రికార్డుల వ్యవస్థకు డిజిటల్ భద్రతను జోడిస్తున్నారు. ముఖ్యంగా భూ యాజమాన్య హక్కుల పై అనుమానాలు, వివాదాలకు చెక్ పెట్టేలా అధికారులు కార్యచరణ రూపొందించారు. ఇందులో కేవలం సాగు వివరాలే కాకుండా భూమి హక్కు సంక్రమణ వివరాలను కూడా రికార్డుల్లోకి ఎక్కించనున్నారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం పహాణి రికార్డ్ అప్ డేట్ చేయనున్నారు. ఇప్పటి వరకు గ్రామ రెవెన్యూ (Revenue) సహాయకులు ఈ పహాణీ రాతలు రాసేవారు. మారిన చట్టాలు.. పరిపాలన సంస్కరణల నేపథ్యంలో ఈ బాధ్యతలను ప్రభుత్వం కొత్త యంత్రాంగం చేతిలో పెడుతుంది. గ్రామ పంచాయతీల్లో ఉండే.. కొత్త జీపీవోలకు ఈ పహాణి రికార్డుల నిర్వహణ బాధ్యతను అప్పగించనుంది. ఇప్పటికే 3,500 మంది జీపీవోలను నియమించారు. మిగిలిన గ్రామాల్లోనూ త్వరలోనే నియమించనున్నారు.

2026 Pahani | మ్యాన్యువల్ పహాణీ రికార్డుల నిర్వహణ
దశాబ్ధ కాలం నుంచి రాష్ట్రంలో మ్యాన్యువల్ పహాణీ రికార్డుల నిర్వహణ అటకెక్కింది. డిజిటల్ (Digital) విధానం పేరుతో క్షేత్ర స్థాయిలో ప్రతి సంవత్సరం జరగాల్సిన జమాబందీ ప్రక్రియను గత పాలకులు పక్కనపెట్టారు. దీంతో పదేళ్లుగా గ్రామాల్లో భూలెక్కలు కాగితాలకే పరిమితం అయ్యాయి తప్పా.. క్షేత్రస్థాయి వాస్తవాలకు అద్డం పట్టడం లేదు. ఈ లోపాన్ని సరిదిద్దుతూ కొత్త సంవత్సరం ఆరంభం నుంచే గ్రామాల్లో మళ్లీ పహాణీ రికార్డులను ఓపెన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాత రికార్డులకు దుమ్ము దులిపి భూ భారతి చట్టం ప్రకారం పక్కగా ప్రతి సర్వే నెంబర్ ను నమోదు చేయనుంది. గ్రామాల్లో 90 శాతం భూమి హక్కుల కోసమే గొడవలు జరుగుతుంటాయి. ఇప్పుడు పహాణి రావడం వలన భూమి ఎవరిది అనేది ఈజీగా తెలిసిపోతుంది. దీంతో రైతులు ఏళ్లు తరబడి కోర్టులు చుట్టూ బాధ తప్పుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
