Rally | ఇంధన పొదుపుతో అభివృద్ధి

Rally | ఇంధన పొదుపుతో అభివృద్ధి

  • కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్

Rally | శ్రీ స‌త్య‌ సాయి జిల్లా, ఆంధ్రప్రభ : భవిష్యత్ తరాలకు సుస్థిరమైన జీవన విధానం అందించాలంటే ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపును తమ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని స‌త్య‌సాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక సత్యమ్మ గుడి వద్ద జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… జిల్లాలో ఈ నెల 20 వరకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.

“ఇంధనం పొదుపు చేద్దాం – భావితరాలకు వెలుగునిద్దాం” అనే నినాదంతో సత్యమ్మ గుడి వద్ద ప్రారంభమైన ర్యాలీ… ఆర్టీసీ బస్టాండ్, కలెక్టరేట్, గోకులం మీదుగా గణేష్ సర్కిల్ నందలి పవర్ హౌస్ వరకు సాగిందని చెప్పారు. ఈ ర్యాలీ ద్వారా ప్రజల్లో విద్యుత్ పొదుపు, శక్తి సామ‌ర్థ్యం వినియోగంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని వివరించారు. అవసరం లేని సమయంలో లైట్లు, పంకాలు ఆపడం, విద్యుత్ పొదుపు పరికరాల వినియోగం, పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి సారించి ప్రతి కుటుంబం ఇంధన పొదుపులో భాగస్వాములవ్వాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ క్రాంతి, విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply