Celebrities | దుగ్గిరాలకు నివాళులు..

Celebrities | దుగ్గిరాలకు నివాళులు..
Celebrities | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ జగన్నాధపురంలోని చందన రెసిడెన్సీ ఆవరణలో ఉంచిన సీనియర్ జర్నలిస్ట్ స్వర్గీయ దుగ్గిరాల ప్రభాకర్ భౌతికకాయానికి రాజకీయ పార్టీల ప్రముఖులు, గుడివాడ పట్టణ ప్రముఖులు, పాత్రికేయ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, సీనియర్ టీడీపీ (TDP) నాయకులు పిన్నమనేని బాబ్జీ, వైసీపీ రాష్ట్ర నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్, తదితర ప్రముఖులు ప్రభాకర్ భౌతిక కాయానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. దశాబ్దాలుగా మీడియా రంగంలో ప్రభాకర్ చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు.
