CM 2 Ministers | పాలనేదీ

CM 2 Ministers | పాలనేదీ

CM 2 Ministers | ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరూ బిజీ..


కానీ ఎవరి దారి వారిదే
శాఖలపై పట్టు సాధించని అమాత్యులు
సమీక్షలు, పర్యవేక్షణలు మృగ్యం
కాంగ్రెస్ అధిష్టానం మితిమీరిన జోక్యంతో సగం అనర్థం
స్వేచ్ఛ లేక అడకత్తెరలో పోకచెక్కలా ముఖ్యమంత్రి
సవాలక్ష సమస్యలతో ప్రజలు సతమతం
సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు నిత్యకృత్యం
ఎరువుల కొరతను పట్టించుకోని పాలకులు..
అన్నదాతల ఆగ్రహం
ఫ్రీ బస్కు ఆదరణ ఉన్నా.. రవాణా సమస్యపై దృష్టి పెట్టని వైనం
కీలక శాఖలపై పట్టు లేని దైన్యం
ప్రజల్లో పలుచన అవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

CM 2 Ministers | ప్రజలంటే పట్టదేమి!

CM 2 Ministers | పల్లె ప్రాంత ప్రజల అండదండలతో అధికారం చేపట్టిన హస్తం పార్టీ, పాలనలో పట్టు కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. ఆరు గ్యారంటీలు, పలు మెగా హామీలను అమలు చేయడం ద్వారా ప్రజాపాలన అందిస్తామంటూ అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ, ప్రజా సమస్యల పరిష్కారాన్ని పక్కన పెట్టిందన్న విమర్శలు మూటగట్టుకుంటోంది. ముఖ్యమంత్రి మొదలుకొని యావత్ మంత్రివర్గమంతా ప్రతి నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో బిజీగా ఉంటున్నప్పటికీ, కీలకమైన ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో మిన్నకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 140 ఏళ్లవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అమాత్యులుగా వెలుగొందుతున్న కొందరు, తమతమ శాఖలపై పట్టు సాధించలేక ప్రజల్లో పలుచన కావడం విడ్డూరంగా మారుతోంది. పక్క రాష్ట్రంలో నెలకోసారి మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష జరుగుతుండగా, రాష్ట్రంలో మాత్రం అలాంటి ప్రయత్నాలు జరగక పోవడం, ఎవరి తీరు వారిదేనన్నట్లు వారు వ్యవహరించడంతో ప్రధాన సమస్యలకు పరిష్కారం లభించడం లేదు.

CM 2 Ministers

సంక్షేమ హాస్టళ్లలో చోటు చేసుకుంటున్న నిర్లక్ష్యం, పిల్లల ప్రాణాలను బలికోరుతోంది. అయినప్పటికీ ఆ శాఖలో లోపాలపై కనీసం సమీక్ష నిర్వహించక పోవడం బాధిత కుటుంబాలకు ఆగ్రహం తెప్పిస్తోంది. మరోవైపు ఆటోవాలాల ఆత్మహత్యలపై కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు కానరావడం లేదు. ఆడబిడ్డల కోసం ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకానికి విశేష ఆదరణ లభిస్తున్నప్పటికీ, శాఖాపరమైన సమస్యలను పరిష్కరించలేక పోతున్నారు.

మరోవైపు అన్నదాతలకు సకాలంలో ఎరువులను అందించలేకపోవడం, రైతు రుణమాఫీ, భరోసాలను పూర్తిస్థాయిలో అమలు చేయక పోవడం ప్రజాగ్రహానికి కారణమవుతోంది. ఇలా అనేక సమస్యలు తెలంగాణ ప్రజలను పీడిస్తున్నా, పాలకులు పరిష్కార మార్గాలను అన్వేషించక పోవడం ఆందోళనకు కారణమవుతోంది……….మిగతా కథనం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

click here for more

Leave a Reply