Indrakeeladri | పటిష్ట ఏర్పాట్లు..

Indrakeeladri | పటిష్ట ఏర్పాట్లు..

  • భవానీ దీక్షలు విరమణకు సౌక‌ర్యాలు
  • సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు
  • దేవాదాయ కమిషనర్ రామచంద్రమోహన్

Indrakeeladri | (ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై (Indrakeeladri) కొనసాగుతున్న భవానీ దీక్షల విరమణ నాలుగో రోజున దేవాదాయ శాఖ కమిషనర్ ఎం.రామచంద్ర మోహన్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవానీలకు కల్పించిన సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. ప్రాచీన కాలం నుంచి ఆనవాయితీగా కొనసాగుతున్న భవానీ దీక్షల విరమణ ప్రక్రియకు జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ తోపాటు, పోలీస్ కమిషనర్, ఇతర జిల్లా అధికారులు సంయుక్తంగా సమర్థవంతమైన, కీలకమైన ఏర్పాట్లు చేశారని కమిషనర్ కోడూరు రామచంద్ర మోహన్ ప్రశంసించారు.

Indrakeeladri

నాలుగో రోజు ఉదయం నాటికి మొత్తం 3.75 లక్షల మంది భవానీలు అమ్మవారిని దర్శించుకుని దీక్షలు (Deeksha) విరమించుకున్నారు. ప్రక్రియ అంతా సజావుగా, విజయవంతంగా కొనసాగుతోందని దేవాదాయ కమిషనర్ రామచంద్రమోహన్ వివరించారు. చివరి రోజు మరో లక్ష మంది భవానీలు వచ్చే అవకాశం ఉందని, ఈ ఏడాది మొత్తం 5.5 నుంచి 6 లక్షల మంది భవానీలు విచ్చేస్తారని అంచనా వేస్తున్నారు.

Indrakeeladri

భక్తులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలు చివరి రోజు వరకు ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని అధికారులకు కమిషనర్ రామచంద్ర మోహన్ (Ramachandra Mohan) అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. చివరి రోజుకు సరిపడా ప్రసాదం నిల్వలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం, క్యూ లైన్లలో ఉన్న భవానీలతో నేరుగా మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. అధికారులు కల్పించిన వసతులు, సౌకర్యాలపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భవానీలకు కమిషనర్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. సీన నాయక్ తో కలిసి స్వయంగా మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.

Leave a Reply