Elections | కత్తెరను ఓటెయ్యండి.. కష్టాలు తీరుస్తా..

Elections | కత్తెరను ఓటెయ్యండి.. కష్టాలు తీరుస్తా..

  • విజయం దిశగా కేసారపు రవి

Elections | మంథని, ఆంధ్రప్రభ : తొలిసారిగా ప్రజాసేవకు అంకితమవుదామనే ఉద్దేశ్యంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఎన్నికల్లో ఆశీర్వదించాలని కేసారపు రవి తెలిపారు. తాడిచర్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముంగిటకు వస్తున్నానని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కత్తెరకు ఓటేసి తనను గెలిపిస్తే ప్రజల సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు. తొలిసారిగా ఎన్నికల బరిలోకి నిలుస్తున్నానని, గ్రామస్తుల మద్దతు కూడగట్టుకోని, తాడిచర్ల గ్రామ ప్రజల సహకారంతో నామినేషన్ వేసినట్లు ఆమె తెలిపారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం కేసారపు రవికి అధికారులు కత్తెర గుర్తు కేటాయించారు.

ఈ గుర్తు పై పోటీ చేస్తున్న రవి ప్రజలు తనను ఆదరిస్తే గ్రామంలో మంచినీటి సమస్య తీర్చడానికి కృషి చేస్తానని వెల్లడించారు. గ్రామంలో ప్రత్యేకంగా బోర్లు వేయించి కుళాయిల ద్వారా ఇంటింటికి నీటి సరఫరా చేసేందుకు తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామానికి పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించడానికి సైతం అంకితభావంతో కృషి చేస్తారని స్పష్టం చేశారు. సర్పంచిగా అవకాశం కల్పిస్తే గ్రామ సమగ్రాభివృద్ధికి చేస్తానని ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.

Leave a Reply