Sravanthi | ఆదరించి గెలిపించండి..

Sravanthi | ఆదరించి గెలిపించండి..
గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా
అనంతారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఈసం స్రవంతి
Sravanthi | జూలూరుపాడు, ఆంధ్రప్రభ : ఎన్నికల్లో ఆదరించి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అనంతారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఈసం స్రవంతి అన్నారు. ఈ రోజు ఆమె ఇంటింటి ప్రచారంలో ఓటర్లను ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్నిబీఆర్ఎస్, టీడీపీ, సీపీఐలు బలపరుస్తున్నాయన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నోచుకోలేదని, ఎన్నికల్లో అవకాశం కల్పిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు.
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అమూల్యమైనదని, గ్రామానికి మంచి చేసే వ్యక్తులను సర్పంచ్ స్థానానికి ఎన్నుకోవాలన్నారు. అనంతారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది, అభివృద్ధిలోనూ అగ్రస్థానంలో నిలుపుతానని ప్రజకు వివరిస్తున్నారు. యువజన, మహిళా సంఘాలు, గ్రామంలోని పెద్దల సహాయ సహకారాలు, సూచనలను పాటిస్తున్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులైన ప్రతి కుటుంబాలకు అందేలా చూస్తానని, ఉపాధి అవకాశాలు కల్పన కోసం కృషి చేస్తానని భరోసానిస్తున్నారు. ప్రజాసేవే లక్ష్యంగా ఊరికి మేలు చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన సర్పంచ్, వార్డు సభ్యులకు ఓట్లు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను ఈసం స్రవంతి అభ్యర్థించారు.
