Warangal | పోలింగ్ కేంద్రాల్లో పచ్చదనం..

Warangal | పోలింగ్ కేంద్రాల్లో పచ్చదనం..
Warangal, నర్సంపేట, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లాలో రెండో విడత జరుగుతున్న ఎన్నికలకు పలు పోలింగ్ కేంద్రాలను గ్రీన్ పోలింగ్ కేంద్రాలుగా సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ఈ సందర్భంగా రెండో విడతలో ఆదివారం జిల్లాలోని నాలుగు మండలాల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రతి మండలానికి రెండు హరిత (గ్రీన్) పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
గీసుకొండ మండలంలోనీ గీసుకొండ, గంగాదేవిపల్లి పోలింగ్ కేంద్రాలు, దుగ్గొండి మండలంలోని వెంకటాపూర్, దేశాయిపల్లి పోలింగ్ కేంద్రాలు, నల్లబెల్లి మండలంలోని నల్లబెల్లి సుమంగళి ఫంక్షన్ హాల్, నందిగామ పోలింగ్ కేంద్రాలు, సంగెం మండలంలోని సంగెం జడ్పీ హైస్కూల్, మొండ్రాయి పోలింగ్ కేంద్రాలు ఓటర్లను ఆకట్టుకునేలా హరిత పోలింగ్ కేంద్రాలుగా తీర్చిదిద్దినట్లు కలెక్టర్ తెలిపారు. ఆహ్లాదకరమైన, వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లను కలెక్టర్ కోరారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లు టెన్షన్ పడకుండా నిదానంగా ఎవరి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగకుండా అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని కలెక్టర్ సత్య శారద సూచించారు.
