Ootkur | విద్యావంతురాలుగా సేవ చేసేందుకు వచ్చా..
- పులిమామిడి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి త్రివేణి
Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : బీటెక్ చదివి మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో ప్రజాసేవ చేసేందుకు ప్రజల ముందుకు వచ్చానని.. ఓట్లు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని పులిమామిడి కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కోతోళ్ళ త్రివేణి అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పులిమామిడి గ్రామంలో వార్డు అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం విస్తృతం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి మంజూరు చేయడంతో పాటు గ్రామ సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తనను గెలిపిస్తే ప్రభుత్వం అధికారంలో ఉండడంతో నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని తెలిపారు.
గ్రామానికి ప్రతినిత్యం ఆర్టిసి బస్సు వచ్చే విధంగా చూస్తానని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు పెన్షన్లు మంజూరు చేస్తాననిఅన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు సీసీ రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేసి చెరువు కట్ట వద్ద రహదారి మరమ్మతులు చేపడతానని అన్నారు. మహిళగా పోటీ చేసేందుకు మంత్రి అవకాశం కల్పించారని గ్రామస్తులు అందరూ ఆదరించి ఓట్లు వేసి గెలిపిస్తే గ్రామాభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తానని అన్నారు.
మాజీ సర్పంచ్ చిన్న సూరయ్య గౌడ్,మాట్లాడుతూ.. మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు 24 గంటలు ప్రభుత్వాసుపత్రి చేపట్టే విధంగా చూస్తానని అన్నారు. అదనంగా పులిమామిడికి అంబులెన్స్ తీసుకువచ్చి జాతీయ బ్యాంకు ఏర్పాటు చేస్తామని ప్రజలకు వివరిస్తూ విస్తృత ప్రచారంచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెన్నప్ప,బాలరాజ్, యూసుఫ్, గజలప్ప, అంజప్ప, రాఘవేందర్ గౌడ్, సుధాకర్, రేషమ్ హన్మంతు, గౌస్ బాలప్ప, శేఖర్, కనకప్ప తదితరులు పాల్గొన్నారు.

