SPORTS | క్రీడలకు ప్రాధాన్యం..

SPORTS | క్రీడలకు ప్రాధాన్యం..
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
SPORTS | గుడివాడ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో క్రీడల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ సబ్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు కరచాలనం అందిస్తూ పరిచయం చేసుకున్న ఎమ్మెల్యే… పలు క్రీడల్లో స్వయంగా పాల్గొని వారిని ఉత్సాహపరిచారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…. చదువులో, ఆటోలో నిత్యం విద్యార్థులను ప్రోత్సహించే ఉపాధ్యాయులు, నేడు ఉత్సాహంగా ఆటల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల్లో క్రీడల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో, క్రీడలకు అంతే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

ఈ కార్యక్రమంలో గుడివాడ జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్రావు, పండ్రాజు సాంబశివరావు, ఏసుపాదం, నిమ్మగడ్డ సత్యసాయి, కడియల గణేష్, ఆదినారాయణ, దేవాది నాగేశ్వరరావు, నిరంజన్, సబ్ డివిజన్ పరిధిలోని గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు, గన్నవరం, ఉంగుటూరు, పెదపారుపూడి, బావులపాడు, మండలాల విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
