3 Men Committee | రాజధాని రైతుల సమస్యపై సమీక్ష

3 Men Committee | రాజధాని రైతుల సమస్యపై సమీక్ష

అమరావతి 3మెన్ కమిటీలో పలు అంశాలపై చర్చ

3 Men Committee | ఉమ్మడి గుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో : అమరావతి రాజధాని పరిధిలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై గుంటూరులో నిర్వహించిన అమరావతి 3మెన్ కమిటీ విస్తృత స్థాయి సమీక్ష సమావేశాన్ని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌తో కలిసి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ (Comunication) శాఖ కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ, రెవెన్యూ, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ..
అమరావతి రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో 3 మెన్ కమిటీ (3 Men Committee) ద్వారా పరిష్కరిస్తుంది. జనరల్ ఇష్యూస్, మేజర్ ఇష్యూస్‌గా సమస్యలను విభజించి ఒక్కొక్క అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నాం. మందడం గ్రామంలో రోడ్ అలైన్‌మెంట్‌కు సంబంధించి రెండు ప్రత్యామ్నాయాలను పరిశీలించాం. రైతుల అభిప్రాయాలు, ఎమ్మెల్యే సూచనల మేరకు ఆప్షన్–1ను తుది నిర్ణయంగా ఎంపిక చేశాం. ల్యాండ్ అక్విజిషన్‌కు సంబంధించిన మొత్తం 47 కేసులు పరిశీలనలో ఉండగా, వాటిలో దాదాపు అన్నీ పరిష్కార దశకు చేరాయి. మిగిలిన కొద్ది కేసులు కూడా వచ్చే వారం లోపు పూర్తవుతాయి.

3 Men Committee

అమరావతి రాజధాని అవసరాల దృష్ట్యా సుమారు 2500 ఎకరాల ల్యాండ్ (Land) అక్విజిషన్ను దశలవారీగా చేపడుతున్నాం. ల్యాండ్ పూలింగ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌పై పూర్తి వివరాలు వెల్లడిస్తూ – మొత్తం 69,421 ప్లాట్లలో 61,793 ప్లాట్లు ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయ్యాయని, మిగిలిన 7,628 ప్లాట్ల సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరిస్తాం. లంకా ల్యాండ్స్‌కు సంబంధించి గతంలో ఉన్న న్యాయపరమైన సంక్లిష్టతలను అధిగమించి రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం చేశాం. జరీబ్ ల్యాండ్స్ సమస్యపై సుమారు 180 ఎకరాల భూమిపై సాయిల్ టెస్టింగ్, వాటర్ లెవెల్ స్టడీ నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని, రెండు వారాల్లో నివేదిక అందుతుంది. గ్రామ కంఠాల విషయంలో 10 సెంట్లకు పైగా ఉన్నభూములపై సమగ్ర వెరిఫికేషన్ చేపడుతున్నామని, మొత్తం అంచనా 1600 ఎకరాలు ఉంటాయి. రోడ్ హిట్ ల్యాండ్స్, TDR బాండ్స్, కాంపెన్సేషన్ అంశాలపై రైతులకు నష్టం కలుగకుండా న్యాయబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటాం. రైతుల విశ్వాసం, న్యాయం, పారదర్శకతే ప్రభుత్వ విధానమని, అదే స్ఫూర్తితో అమరావతి అభివృద్ధి కొనసాగుతుంది.

3 Men Committee

మంత్రి నారాయణ మాట్లాడుతూ..
అమరావతి రాజధానిలో సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారాయణ (minister Narayana) తెలిపారు. అమరావతి పరిధిలోని 26 గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి పనుల డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నామని, వాటిలో 12 డీపీఆర్‌లు పూర్తయ్యాయని, మిగిలినవి కూడా త్వరలో పూర్తి చేస్తాం. 18 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, వీటి కోసం మొత్తం ₹22.6 కోట్లు కేటాయించాం. లంకా ల్యాండ్స్ విషయంలో కోర్టు కేసులు ఉన్నప్పటికీ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రిస్క్ తీసుకొని రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శానిటేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని, కాంట్రాక్టర్ల పనితీరును కఠినంగా పర్యవేక్షిస్తాం. రోడ్ హిట్స్, కాంపెన్సేషన్, టీడీఆర్‌ బాండ్స్ అంశాలపై మూడు నెలల లోపు స్పష్టమైన పరిష్కారం అందిస్తాం. అమరావతి అభివృద్ధిలో కేంద్ర–రాష్ట్ర సమన్వయం కీలకమని, అందుకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారం ఎప్పటికీ ఉంటుంది.

ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ..
అమరావతి ప్రాంత రైతులతో నిరంతర సంభాషణ కొనసాగిస్తూనే సమస్యలను పరిష్కరిస్తున్నామని, ప్రతి 15 రోజులకు ఒకసారి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నాం. గ్రామ కంఠాలు, జరీబ్ / నాన్-జరీబ్ ల్యాండ్స్, రోడ్ హిట్ భూముల విషయంలో రైతుల్లో ఉన్న భయాలు, సందేహాలను తొలగించేలా ప్రభుత్వం (Govt) చర్యలు తీసుకుంటుంది. ల్యాండ్ అక్విజిషన్ ప్లాట్లపై నిర్వహించిన టెలిఫోన్ సర్వే వివరాలను వెల్లడిస్తూ – సుమారు 69శాతం రైతులు వేచి చూడటానికి సిద్ధంగా ఉన్నారని, 9శాతం రైతులు ఆల్టర్నేట్ ప్లాట్ కోరారని, మిగిలిన వారు నిర్ణయానికి కొంత సమయం కోరుతున్నారు. గత ప్రభుత్వం తొలగించిన ల్యాండ్‌లెస్ పూర్ పెన్షన్లను పునరుద్ధరించామని, కొత్తగా సుమారు 3000 మందికి పెన్షన్ అందించేలా చర్యలు తీసుకున్నాం. హెల్త్ కార్డ్స్ విషయంలో 18,000 కొత్త సభ్యులను చేర్చడంతో పాటు 2000 కొత్త కార్డులు జారీ చేసాం. గ్రామాల్లో కమ్యూనిటీ హాల్స్, రోడ్లు, డ్రైనేజీ, శానిటేషన్ వంటి మౌలిక వసతులు రైతుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తాం.

3 Men Committee

Leave a Reply