RAMESH | గ్రామాభివృద్ధికి ప్ర‌ణాళిక

RAMESH | గ్రామాభివృద్ధికి ప్ర‌ణాళిక

  • గుడిహత్నూర్ అభివృద్ధికి బాటలు..
  • సర్పంచ్ అభ్యర్థి జాదవ్ రమేష్

RAMESH | ఆంధ్రప్రభ, గుడిహత్నూర్ : గుడిహత్నూర్ గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరిగిందని, ప్రజలు అవకాశం ఇచ్చి గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి జాదవ్ రమేష్ అన్నారు. మూడవ విడత జరగనున్నఎన్నికల్లో భాగంగా రమేష్ విస్తృత ప్రచారం గావించారు. ప్రజలు ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతానని జాదవ్ రమేష్ పేర్కొన్నారు.

RAMESH

Leave a Reply