Chennuru | గెలుపు మాదే..

Chennuru | గెలుపు మాదే..

Chennuru, కల్లూరు, ఆంధ్రప్రభ : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో చెన్నూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన జినుగు. శ్రీనివాసరావు ప్రజా క్షేత్రంలో నూటికి నూరు శాతం గెలిచి తీరతారని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాలెపు రామారావు ధీమా వ్యక్తం చేశారు. గడచిన రెండు దపాలుగా జరిగిన సర్పంచ్ ఎన్నికలలో ప్రజా బలంతో తిరుగులేని విజయం సాధించామని తద్వారా పది సంవత్సరాలుగా గ్రామ ప్రజలకు పంచాయతీకి ఎనలేని సేవలు అందించిన చరిత్ర మా కుటుంబానికి సొంతం అని అన్నారు. గ్రామ ప్రజల అందరి కుటుంబాలలో ఒక కుటుంబ సభ్యునిగా చెరగని స్థానం సంపాదించామని అన్నారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సహకారంతో గ్రామాన్ని అని రంగాలలో అభివృద్ధి పరచామని తెలియజేశారు.

టీఆర్ఎస్ పార్టీ చెన్నూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా విద్యావంతుడు మాజీ ఎంపీటీసీగా ప్రజాసేవలో విస్తృతమైన సేవలు అందించిన శ్రీనివాసరావును గ్రామ ప్రజలు ఆదరించి తమ అమూల్యమైన ఓటును ఫుట్బాల్ గుర్తు పై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన గ్రామస్తులను కోరారు. ప్రజాక్షేత్రంలో ప్రచారం నిర్వహించటానికి వెళ్ళినప్పుడు, అసెంబ్లీ ఎన్నికలలో మీ మాట వినకుండా తప్పు చేశామని, పంచాయతీ ఎన్నికలలో మీరు బరిలో ఉంచిన అభ్యర్థికి ఓటు వేసి ఆ తప్పును సరిదిద్దుకుంటామని ప్రజల స్వయంగా తెలియజేస్తున్నారని అన్నారు.

ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, ఉన్నత చదువులు చదివే బాలికలకు స్కూటీలు ఇవ్వడం.. ఇలా అమలు కాని హామీలు ఇచ్చి అధికారం వచ్చాక చేతులెత్తేసిన ప్రభుత్వం పై పూర్తి వ్యతిరేకత వచ్చింది అనడానికి ప్రజలు తమతో చెబుతున్న మాటలే నిదర్శనం అన్నారు. గ్రామపంచాయతీని అన్ని రంగాలలో మేమే అభివృద్ధి చేశామని, ఇప్పుడు కొత్తగా వచ్చి ఎవరు ఏమి చేసేది లేదన్నారు. సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం గ్రామ ప్రజలతో మమేకమై ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మండల పరిధిలో సుమారు 13 కి పైగా గ్రామపంచాయతీలు టీఆర్ఎస్ పార్టీ కైవాసం చేసుకుంటుందని ఆయన జోష్యం చెప్పారు.

Leave a Reply