Development | సీపీఐ సర్పంచి అభ్యర్థులను గెలిపించాలి
Development | భద్రాద్రి, ఆంధ్రప్రభ : మండల వ్యాప్తంగా సీపీఐ పార్టీ సర్పంచులు, వార్డు అభ్యర్థులను గెలిపించాలని, గెలుపు లక్ష్యంగా మండలంలో వాడవాడలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ పార్టీ కార్యదర్శి షేక్ సాబీర్ పాషా(Sheikh Sabir Pasha) ఈ రోజు సమావేశాలు నిర్వహించడం జరిగిందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రేసు ఎల్లయ్య తెలిపారు.
మండలంలోని 9 మంది సర్పంచులతో పాటు వార్డు అభ్యర్థులను గెలిపించేందుకు అన్నివర్గాల వీధులలో బహిరంగ సమావేశం నిర్వహించారు. సర్పంచ్ అభ్యర్థులు మమత, పగడయ్య, స్వరూప, ఉమా, రాజేందర్, భద్రయ్య, శ్రీరామ్, వెంకటలక్ష్మి, కాంతల విజయాన్ని కాంక్షిస్తూ ప్రజలను అభ్యర్థించారు. సీపీఐ పార్టీనీ గెలిపించేందుకు గ్రామంమొత్తం ఒక్కటై ముందుకు వస్తోందని తెలిపారు.
సమస్యలు పరిష్కరించడంలో అభివృద్ధి(Development) పనుల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకురాలుగా మెస్సు మమత ప్రజలను ఉత్సాహపరుస్తోందన్నారు. ప్రజలకు చేరువై పనిచేసే నాయకురాలు మమత మాత్రమేనని, అభివృద్ధి ప్రయాణం కొనసాగాలంటే ఆమెను భారీ మెజార్టీ(huge majority)తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామపెద్దలు, యువత మహిళలు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని, గ్రామఅండతో, ఆశతో ఉన్నవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గ్రామంలో వీధి వీధినా ప్రచారం చేస్తూ సర్పంచ్ అభ్యర్థి మమత అభ్యర్థిత్వానికి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. అభివృద్ధి, సేవలను ప్రాధాన్యంగా ఉంచిన ఆమెకు మద్దతుగా ప్రజల్లో స్పష్టమైన గెలుపు కనిపిస్తోందని, సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి, గ్రామ అభివృద్ధి పదంలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

