Minister | అండగా నిలవండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా…

Minister | అండగా నిలవండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా…
Minister | మక్తల్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి అండగా నిలవండి.. గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సవరమ్మ రామాంజనేయులు అన్నారు. సర్పంచ్‌గా గెలిపిస్తే నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోనే గడ్డంపల్లి గ్రామాన్ని మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) సహకారంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు.
సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న ఎం.సవరమ్మ రామాంజనేయులు ఈ రోజు గ్రామంలో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. కలుసుకొని గ్రామ అభివృద్ధి కోసం ఎన్నికల్లో తనకు సర్పంచిగా అవకాశం కల్పించవలసిందిగా విన్నవించారు. తనను సర్పంచ్ గా గెలిపిస్తే చేపట్టబోయే అభివృద్ధి పనులను ఓటర్లకు వివరించి మద్దతును కోరారు. ప్రభుత్వ సంక్షేమ(Government Welfare) పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి రాజకీయాలకు అతీతంగా అందజేయడమే తన లక్ష్యమని అన్నారు .
గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇతరుల మాయమాటలకు మోసపోకుండా నిస్వార్ధంగా సేవ చేసేందుకు మహిళలగా ముందుకు వచ్చిన తనకు అండగా నిలవాల్సిందిగా ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారమే(solution) ధ్యేయంగా పనిచేస్తానని తనకు మద్దతునిచ్చి సర్పంచ్ గా గెలిపించవలసిందిగా ఎం. సవరమ్మ రామాంజనేయులు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బి.త్రివేణి జ్ఞానేశ్వర్ , సుభద్రమ్మ ,రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
