Candidate | అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా…

Candidate | అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా…

  • కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి జన్నబెల్లి జనార్దన్ రెడ్డి

Candidate | జనగామ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లు అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ అభ్యర్థి జనార్దన్ రెడ్డి అన్నారు. మంగళవారం జనగామ మండలంలోని ఓబుల్ కేశపురం గ్రామంలో ఇంటింట కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించి కార్నర్ మీటింగ్ లో జనగామ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు లకావత్ ధన్వంతి లు మాట్లాడుతూ… ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమాలతో పాటు ముందుకు పోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ ఉచిత బస్సు సౌకర్యం సోలార్ ప్లాంట్ల ఆర్టీసీ బస్సులు మహిళా సంఘాలకు ఇచ్చి యజమానుల‌ను చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కిందన్నారు.

మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు, అభివృద్ధి సంక్షేమంగా రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా, ప్రతి ఇంటికి ఉచిత కరెంటు, పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలోనే కాక ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ తీర్చిదిద్దాలని లక్ష్యం నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన ధ్యేయంగా ప్రజా పాలన ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. విద్య వైద్యం అభివృద్ధి సంక్షేమం కోసం అనేక నిధులను విచిస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో ప్రజలను మోసం చేస్తూ పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ రైతులకు రుణమాఫీ పేదవాడికి రేషన్ కార్డుల పంపిణీ అందించలేక వైఫల్యం చెందిందన్నారు.

ప్రజాపాలనలో సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న ఘనత ఈ ప్రజా పాలన ప్రభుత్వానిద‌న్నారు. పేదవాడికి రేషన్ కార్డులు, ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడమే కాకుండా నియామక పత్రాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రజా పాలన ప్రభుత్వమన్నారు. అందుకోసం గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ.. ఈ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జనార్దన్ రెడ్డికి అత్యధిక సంఖ్యలో కత్తెర గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించి గెలిపించాలన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు బడికి ఇందిరా కిష్టయ్య డాక్టర్ రాజమౌళి బుచ్చిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మల్లారెడ్డి నర్సింగరావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply