Polling Stations | రాజాపేటలో 91.56 శాతం పోలింగ్…

Polling Stations | రాజాపేటలో 91.56 శాతం పోలింగ్…

  • పోటా పోటీగా కాంగ్రెస్, బీఆర్ఎస్
  • కొండ్రెడ్డి చెరువులో అత్యధికంగా పోలింగ్ నమోదు
  • లక్కీ డ్రా ద్వారా లక్ష్మక్క పల్లిలో రాజయ్య గెలుపు

Polling Stations | రాజాపేట, ఆంధ్రప్రభ : రాజాపేట మండలంలోని ఆయా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. 23 గ్రామ పంచాయితీలకు గాను రెండు గ్రామాలు మల్లగూడెం, పుట్టగూడెం ఏకగ్రీవమ‌య్యాయి. 21 గ్రామాల్లో పురుషులు 14,430, స్త్రీలు 14, 715 కాగా మొత్తం 29,145 ఓటర్లు ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 58 కలుపుకొని పురుషులు 13,354, స్త్రీలు 13, 330 కాగా మొత్తం 26,684 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 91.56 శాతం పోలింగ్ నమోదయ్యింది.. పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు, అదనపు కలెక్టర్ భాస్కర్ రావ్, డిసిపి ఆకాంక్ష్ యాదవ్ లు పరిశీలించారు.

అత్యధికంగా కొండ్రెడ్డి చెరువు లో పోలింగ్…
మండలంలోని అత్యధికంగా కొండ్రెడ్డి చెరువు గ్రామంలో 97.35 శాతం పోలింగ్ నమోదయ్యింది. గ్రామంలో 604 ఓట్లకు గాను 588 ఓట్లు నమోదు అయ్యాయి. అత్యల్పంగా రాజాపేట లో 88.96 శాతం పోలింగ్ జరిగింది. 3,251 ఓట్లకు గాను పోస్టల్ బ్యాలెట్ 6 ఓట్లను కలుపుకొని 2,892 ఓట్లు పోలయ్యాయి. మండలంలో పురుషుల ఓట్లు 14,430 కు గాను 13,354 ఓట్లు పోలవ్వగా, స్త్రీలు 14,715 ఓట్లకు గాను 13,330 ఓట్లు పోలయ్యాయి. పురుషుల ఓట్లు అధిక శాతం పోలయ్యింది.

రాజాపేట మండలంలో గెలుపొందిన సర్పంచ్ లు, పోలింగ్ శాతం వివరాలు..

క్రమసంఖ్య – గ్రామం పేరు, పోలింగ్ శాతం, పార్టీ పేరు

1, రాజాపేట – 88.96 – కోయ మధు – బీజేపి
2, బొందుగుల-89.80-పయ్యావుల ఎల్లయ్య-బీఆర్ఎస్
3, దూది వెంకటాపురం – 94.72 -ఎన్ నరేష్- కాంగ్రెస్
4, లక్ష్మక్క పల్లి – 91.64 – ఇండ్ల రాజయ్య- బీఆర్ఎస్
5, సోమారం – 91.18 – గొలుసుల అనూష- కాంగ్రెస్
6, బసంతాపురం -94.05 -మెండు రత్నమాల-కాంగ్రెస్
7, కాల్వపల్లి -93.49 – ఇంజ లక్ష్మి – కాంగ్రెస్
8, రఘునాథపురం-89.90 పల్లె సంతోష్ గౌడ్,బీఆర్ఎస్
9, రేణికుంట – 92.24 – కర్రె వెంకటేష్ – బీఆర్ఎస్
10, బేగంపేట – 93.16 – మంత్రాల అనూష- బీఆర్ఎస్
11, చల్లూరు – 92.46 – బీమగాని రూప – కాంగ్రెస్
12, నర్సాపూర్ – 96.19 – ఎమ్మ శిరీష – కాంగ్రెస్
13, కొండ్రెడ్డి చెరువు – 97.35 – ఉప్పరి నరేష్ – కాంగ్రెస్
14, పాముకుంట – 90.94 – రంగ నరేష్ – కాంగ్రెస్
15, సింగారం – 92.00 – కొండ ప్రమీల – బీఆర్ఎస్
16, నమిల – 90.96 – పులి రాజు- స్వతంత్ర
17, పారుపల్లి – 89.22 – మోత్కుపల్లి జ్యోతి – కాంగ్రెస్
18, బూరుగుపల్లి – 95.26- చింతల సంపత్ -బీఆర్ఎస్
19, కుర్రారం – 91.96 – బొడ్డు భాస్కర్ – బీఆర్ఎస్
20, జాల – 92.43 – గంధమల్ల నవనీత – కాంగ్రెస్
21, కొత్తజాల-95.08 -ఠాకూర్ లావణ్య -బీఆర్ఎస్
22, మల్ల గూడెం – జన్నెపల్లి బాలరాజు రెడ్డి – బీఆర్ఎస్

23, పుట్టగూడెం – -రాంజీ నాయక్ చౌహన్ – కాంగ్రెస్

సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి
మంథన్ గోడ్ సర్పంచ్ అభ్యర్థి రాజేందర్ గౌడ్

Polling Stations | మక్తల్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిపించండి.. గ్రామ అభివృద్ధితో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కె.రాజేందర్ గౌడ్ అన్నారు. నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని మంథన్ గోడ్ లో ఇవాళ‌ గ్రామంలో తన మద్దతుదారులతో ఇంటింటి ప్రచారం చేపట్టారు.

మక్తల్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిపించండి.. గ్రామ అభివృద్ధితో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కె.రాజేందర్ గౌడ్ అన్నారు. నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని మంథన్ గోడ్ లో ఇవాళ‌ గ్రామంలో తన మద్దతుదారులతో ఇంటింటి ప్రచారం చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకొని తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి సేవకుడిగా పని చేస్తానన్నారు. గ్రామంలోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ద్వారా అధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. స్థానిక సమస్యలన్నీంటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజల మద్దతుతోనే అభివృద్ధి సాధిస్తానన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన మద్దతుదారులతో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్య గౌడ్, గోపాల్ గౌడ్, వెంకటయ్య, హన్మంతు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply