ఫలితాల్లో ఢీ అంటే ఢీ…

  • కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
  • రెండుతో సరిపెట్టుకున్న కమలం

ఆంధ్రప్రభ, ప్రతినిధి / యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలోని మొదటి దశ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్… ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఫలితాలు వచ్చాయి. ఆలేరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని 153 గ్రామాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 85, బీఆర్ఎస్ 53, బీజేపీ 2, స్వతంత్ర 9, సిపిఐ 2 స్థానాల్లో గెలుపొందారు. ఉత్కంఠతో సాగిన లెక్కింపులో నువ్వా నేనా అన్నట్టే పరిస్థితి కొనసాగింది.

Leave a Reply