బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

  • కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్, ఆంధ్రప్రభ: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీలోకి రోజురోజుకీ వలసలు పెరుగుతున్నాయి. రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సమక్షంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుండి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.

గురువారం సాయంత్రం మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, మక్తల్ నియోజకవర్గం నర్వ మండలంలోని లంకల గ్రామానికి చెందిన మాజీ బీఆర్ఎస్ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ చంద్రకళ, నర్వ మండల నాయకుడు విజయ్ వారి వెంట 30 మంది కార్యకర్తలు నర్వ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీసం చెన్నయ్య సాగర్, ఉమారాయిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వీరందరికీ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రెండేళ్లలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నచ్చి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్దఎత్తున బీఆర్ఎస్, బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినవారంతా సైనికుల్లా పని చేసి గెలిపించాల్సిందిగా మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. ఈ కార్యక్రమంలో నర్వ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply