President | చెన్నారావుపేటలో జంపింగ్‌ల‌ రాజకీయం..

President | చెన్నారావుపేటలో జంపింగ్‌ల‌ రాజకీయం..

President | చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : చెన్నారావుపేట మండల కేంద్ర సర్పంచ్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను కలిగిస్తున్నాయి. కాంగ్రేస్, బీఆర్ఎస్ పార్టీలు గెలుపు కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వ్యూహలు రచిస్తున్నాయి. ఇదే అదునుగా ఇరు పార్టీల్లోకి జంపింగ్ లు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ కి చెందిన సీనియర్ నాయకుడు సిద్ద కుమారస్వామి ఈ రోజు కాంగ్రెస్‌ నాయకులు రాధారాపు ప్రతాప్ రెడ్డి(Radharapu Pratap Reddy), కంది నారాయణరెడ్డి, కుండే కుమారస్వామిల ఆధ్వర్యంలో కాంగ్రేస్ లో చేరారు.

ఇదే రోజూ కాంగ్రెస్‌ గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్(President) లక్క విజయ్, సీనియర్ కాంగ్రెస్‌ నాయకులు లక్క కుమారస్వామి, జెట్టబోయిన వీరభద్రయ్య, కేతిడి జైపాల్ రెడ్డిలు కాంగ్రెస్‌కి రాజీనామా చేసి మండల భారాస అధ్యక్షుడు బాల్నే వెంకన్న, పార్టీ ఎన్నికల ఇంచార్జిలు జక్క అశోక్, జున్నుతుల మహేందర్ రెడ్డి, కుండే మల్లయ్య, బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కంది శ్వేత-కృష్ణచైతన్యరెడ్డిల సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఎన్నికల ముందు చేరికలు ఏ పార్టీకి లాభం జరుగుతాయో వేచి చూడాలి.

Leave a Reply