Phone Tapping | ప్రభాకర్ రావు లొంగిపోవాలి.. సుప్రీం ఆదేశం.. !!

ఆంధ్రప్రభ, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తెలంగాణ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో తీవ్రమైన ఎదురు దెబ్బ తగిలింది. ఆయన శుక్రవారం జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో సరెండర్ కావాలని ఆదేశించింది.
కస్టోడియల్ విచారణ అవసరం అని తెలంగాణ పోలీసులు కోరారు. గతంలో విచారణకు వచ్చినా సహకరించలేదని… 14 రోజుల పాటు విచారణకు కావాలని అడిగారు. దాంతో సుప్రీంకోర్టు శుక్రవారం సరెండర్ కావాలని ప్రభాకర్ రావును ఆదేశించింది.
సిట్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
అయితే, విచారణ సందర్భంగా ప్రభాకర్ రావును శారీరకంగా హింసించవద్దని దర్యాప్తు బృందానికి ప్రత్యేకంగా సూచించింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో ఈ కేసులో ప్రభాకర్ రావు చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకున్నట్లయింది.
