Elections | పోలింగ్ శాతం ఎంత..?

Elections | మంథని, ఆంధ్రప్రభ : మంథని డివిజన్లోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాలతో పాటు పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వ శ్రీరాంపూర్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఈ ఐదు పోలింగ్ కేంద్రాల్లో 1,43,856మంది ఓటర్లకు గాను 75,412 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 52.42 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఉదయం 11 గంటల వరకు మండలాల వారిగా పోలింగ్ సరళి ఈ విధంగా ఉంది.

మంథనిలో 55.57 శాతం, కమాన్ పూర్ లో 53.80, రామగిరిలో 49.94, ముత్తారంలో 44.95, కాల్వ శ్రీరాంపూర్ లో 49.14 శాతం నమోదు కాగా మొత్తం ఈ ఐదు మండలాల్లో తొలి రెండు గంటల్లో 52.42 శాతం పోలింగ్ నమోదయింది. పోలింగ్ కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళి, క్యూ లైన్లు, బందోబస్తు వంటి అంశాలను పరిశీలించడంతో పాటు పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

Leave a Reply